ఇంకుపోయించుకున్న కేజ్రీపై గురువుగారూ గరం అయ్యారు | Anna Hazare slams Kejriwal on Anti National Comments

Anna hazare slams kejriwal on anti national comments

Anna Hazare slams Aravind Kejriwal on asking proofs, asking proofs for surgical strikes, Anna Hazare slams Aravind Kejriwal, Anna Hazare praises Army for Surgical Strikes,

Anna Hazare slams Aravind Kejriwal on asking proofs for surgical strikes.

ఆధారాలు అడిగినందుకు ఆగ్రహాంతో ఊగిపోయాడు

Posted: 10/05/2016 09:08 AM IST
Anna hazare slams kejriwal on anti national comments

జాతి వ్యతిరేక ఆరోపణలతో రాజస్థాన్ బికనీర్ పర్యటనలో ఇంకు పోయించుకున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి మరో చిక్కు ప్రశ్న ఎదురైంది. ఆయన గురు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే నిలదీశారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసిన మోదీకి ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్... అందుకు సాక్ష్యాలు విడుదల చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పాక్ మీడియాలో కేజ్రీని హీరోగా మార్చి కథనాలు ప్రచురిస్తున్నాయి. దీంతో కేజ్రీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాదు ఓ మృతి చెందిన ఓ కార్యకర్తను పరామర్శించేందుకు మంగళవారం రాజస్థాన్ వెళ్లగా, అక్కడ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కు చెందిన ఓ విద్యార్థి కేజ్రీ ముఖంపై ఇంకు పోయగా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తాను ఆ పని చేశానని సదరు విద్యార్థి చెప్పటం విశేషం.

ఇక కేజ్రీవాల్ కామెంట్లపై అన్నా హజారే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ డిజిఎంఓ స్వయంగా ప్రకటన చేసినా నమ్మవా? అని ఆయన కేజ్రీవాల్ ను నిలదీశారు. అంతే కాకుండా ఇండియన్ ఆర్మీని కేజ్రీవాల్ నమ్మకపోవడం ఆశ్చర్యం కలిగించిందని ఆయన చెప్పారు. గతంలో సైన్యంలో పనిచేసిన హజారే దేశం కోసం ఏ క్షణమైనా యుద్ధరంగంలో కాలుపెట్టడానికి సిద్ధమని ప్రకటించారు. సర్జికల్ స్ట్రైక్స్ పై ఇండియన్ ఆర్మీని హజారే అభినందించారు. భారతసైన్యం పరాక్రమం ప్రపంచానికి తెలిసేలా చేశారని ఆయన సైన్యాన్ని అభినందిచారు.

ఇంతకుముందు జనవరి నెలలో కూడా కేజ్రీవాల్‌ మీద ఒకసారి ఇంకు దాడి జరిగింది. అప్పట్లో ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన బృందానికి చెందిన ఒక మహిళ ఆయనపై ఇంకుపోసింది. ఆ సమయంలో.. ముఖ్యమంత్రి భద్రతను ఢిల్లీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపించింది. ఆ మహిళను అరెస్టు చేయకపోగా.. ఆమె మీడియాకు ప్రకటనలు కూడా ఇస్తోందని చెబుతూ, ఇదంతా బీజేపీ కుట్ర అని కూడా అప్పట్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు.

మరోవైపు తనపై జరిగిన ఇంకుదాడిపై కేజ్రీవాల్ అంతే స్పీడ్ గా స్పందించాడు. దాడి జరిగిన అరగంటకే తన ట్విట్టర్ లో సందేశం ఉంచాడు. తనపై ఇంకు చల్లిన వారు చల్లగా ఉండాలంటూ అందులో పేర్కొన్నాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi CM Kejriwal  Ink attack  Slam  Anna Hazare  slam  surgical strike proofs  

Other Articles