సింప్లిసిటీకి మారుపేరుగా ప్రధాని.. అధికారులకు షాక్ Singapore PM Rejects VIP Motorcade For A Bus

Singapore pm rejects vip motorcade for a bus

Lee Hsien Loong, Lee Hsien Loong In India, Lee Hsien Loong India Visit, Singapore PM In India, India-Singapore Strategic Partnership

Singapore Prime Minister Lee Hsien Loong, who arrived in Delhi for a five-day visit to meet PM Modi and indian ministers and officials, hopped onto a chartered bus to reach his hotel in the national capital.

సింప్లిసిటీకి మారుపేరుగా ప్రధాని.. అధికారులకు షాక్

Posted: 10/04/2016 07:36 AM IST
Singapore pm rejects vip motorcade for a bus

సింప్లిసిటీకి మారుపేరుగా నిలిచారు ఆ ప్రధాని, అది కూడా తన దేశంలో కాకుండా మరో దేశానికి పర్యటనకు వచ్చి మరీ తనకు ఎలాంటి వీఐపీ కాన్వాయ్ వాహనాల శ్రేణి వద్దని, సాధారణ బస్సులో ఆయనకోసం ఏర్పాటు చేసిన హోటల్ కు బయలుదేరి వెళ్లారు. ఇంతకీ ఎవరా ప్రధాని..? ఏమా కథ అనుకుంటున్నారా..? మన దేశంలోని పలువురు నేతలు మన దేశంలోని పలు ప్రాంతాలను ఆ దేశం మాదిరిగా అభివృద్ది చేస్తామని బడాయిలకు పోతారే అయనే.

ఆయన మరోవరో కాదు సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్. మన దేశంలో దైపాక్షిక చర్యలు జరిపేందుకు గాను ఐదు రోజుల పాటు పర్యటన కోసం నిన్న సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న ఆయన వాహనాల శ్రేణికి బదులు బస్సులో వెళ్లి అందరినీ అశ్చర్యపర్చారు. ఒక ప్రత్యేక బస్సులో తాను బస చేయాల్సిన హోటల్‌కు వెళ్లిపోయారు. ఇలా బస్సులో ఓదేశ ప్రధాని రావడంతో ఆయనను స్వాగతించేందుకు వచ్చిన అధికారులు, హోటల్ యాజమాన్యం కూడా అశ్చర్యానికి లోనైంది

లూంగ్ తన ఐదు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో, భారత అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతారు. ప్రధానంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల గురించి ఈ చర్చలు ఉంటాయని అంటున్నారు. పలు ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న సింగపూర్ వాసుల గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటుచేసే విందులో కూడా సింగపూర్ ప్రధాని పాల్గొంటారు. లూంగ్‌తో పాటు ఆయన భార్య హో షింగ్, పలువురు కీలక మంత్రులు, సీనియర్ అధికారులు వచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lee Hsien Loong  India vist  charted bus  delhi  PM Modi  

Other Articles