జయ అధికారాలను ఆ ఆరుగురు ఎంజాయ్ చేస్తున్నారు | Team Of 6 In Charge for TN govt

Team of 6 in charge for tn govt pil filed on jayalalithaa s health condition

PIL on Jaya's Illness, PIL on Jayalalitha health condition, Team of Six for TN Govt, Team of Six for Jayalalitha Govt, Team of Six replace Jayalalitha, CM Jayalalitha illness, Jayalalitha Health, Jayalalitha Health Condition, Jayalalitha recovery, Tamilnadu Rule without Jaya

Team Of 6 In Charge for TN govt PIL filed on Jayalalithaa's health condition.

సీఎం లేకుండానే పాలన ఎలా సాగుతుందబ్బా?

Posted: 10/03/2016 04:29 PM IST
Team of 6 in charge for tn govt pil filed on jayalalithaa s health condition

సెప్టెంబర్ 22 తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డీహైడ్రేషన్ కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలైన దగ్గరి నుంచి అన్నాడీఎంకే శ్రేణుల్లోనే కాదు, తమిళనాట మొత్తం ఒక్కటే ఆందోళన. పార్టీ పెద్దలు,, వైద్యులు ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని ప్రకటించినప్పటికీ ఏదో కలవరపాటు. రక్తనాళాల్లో ఇన్ఫెక్షన్ సోకగా, ఈ రకం రుగ్మతకు ప్రపంచంలోనే పేరున్న బ్రిటన్ వైద్యుడిని తమిళనాడు ప్రభుత్వం రప్పించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గవర్నర్ విద్యాసాగర్ ఆస్పత్రిని సందర్శించినప్పటి నుంచి రాజకీయ వలసలు పెరిగిపోవటంతో ఉత్కంఠ మరింత పెరిగిపోయింది.

మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ చెన్నై రావాలంటూ జయ అంతరంగికురాలు శశికళ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి నేడు చెన్నైలో అత్యవసరంగా ఆమె సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అర్జెంటుగా రావాలంటూ సమాచారం అందుకున్న పార్టీ నేతలు జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆ సంగతి పక్కనబెడితే మరి ఈ 15 రోజులుగా పాలన సంగతి ఏంటి? ఒక ముఖ్యమంత్రి లేనిటోటును పార్టీ వర్గీయులు ఎలా పూడ్చారు?. దీనికి సమాధానం కూడా దొరికింది.

ఆమెకు అత్యంత నమ్మకస్తులైన ఆరుగురు సభ్యుల బృందం పాలనా పగ్గాలు చేపట్టినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పాలన గాడి తప్పకుండా చూసేందుకు, 54 ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణను ఆరుగురు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. వీరిలో జయలలితకు నిచ్చెలి శశికళా నటరాజన్, ఆమెకు దీర్ఘకాల నమ్మినబంటు, చీఫ్ సెక్రటరీ షీలా బాలకృష్ణన్, అనుకోని పరిస్థితులు ఏర్పడితే, సీఎం పీఠం ఎక్కి, ఆపై అమ్మ రాగానే నమ్మకంగా పదవిని అప్పగించే సీనియర్ నేత ఓ పనీర్ సెల్వమ్ కీలకులని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు ఆమె ఏరికోరి నియమించుకున్న సీఎంఓలో కార్యదర్శులు ముగ్గురు ఈ టీమ్ లో ఉన్నారని, మరే మంత్రికి కూడా నిర్ణయాధికారాలు లేవని తెలిపాయి.

కాగా, పాలనను ఇలా అనుచరులతో నడిపించడం ఏంటని డీఎంకే అధినేత కరుణానిధి ప్రశ్నిస్తున్నాడు. ఆమె ఆరోగ్యం బాగానే ఉంటుందని అంటున్నారు కదా. వెంటనే ఫోటోలు విడుదల చేయండి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. జయలలిత ఆరోగ్యంపై మద్రాస్‌ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలైంది. జయలలిత ఆరోగ్యంపై వాస్తవ పరిస్థితిని తెలపాలని కోరుతూ న్యాయవాది రామస్వామి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనుంది. గత 11రోజులుగా సీఎం జయ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జయ ఆరోగ్యంపై రకరకాలుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని తెలపాలని కోరుతూ న్యాయవాది ఈ మేరకు పిటిషన్ వేశారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamil Nadu  CM Jayalalitha  Team of Six  Rule  

Other Articles