పాక్ కాల్పులతో యుద్ధవాతవరణం | High Tension at Border after Baramullah firing.

Manohar parrikar rajnath singh review on baramulla attack

Manohar Parrikar, Rajnath Singh review on Baramulla attack, High Tension at Border after Baramulla firing, Baramulla ceasefire, Baramulla change, Baramulla Encounter, India War, Indopak war 2016

Manohar Parrikar, Rajnath Singh review on Baramullah attack.

సరిహద్దులో మరోసారి టెన్షన్..టెన్షన్...

Posted: 10/03/2016 12:21 PM IST
Manohar parrikar rajnath singh review on baramulla attack

యూరీ దాడికి ప్ర‌తీకారంగా పీవోకేలో భార‌త్ జ‌రిపిన దాడుల అనంతరం స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌ ప‌రిస్థితులు ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. దాడుల‌కు ప్ర‌తీకారంగా భార‌త్ దీటైన జ‌వాబు ఇస్తోన్నా పాకిస్థాన్ మాత్రం త‌న బుద్ధిని మార్చుకోవ‌డం లేదు. ప‌దే ప‌దే కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. సోమవారం స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో మరోసారి ఉగ్ర‌వాదులు చొర‌బ‌డడంతో సరిహద్దులో భద్రతపై ర‌క్ష‌ణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు.

పూంచ్ సెక్టార్ ప‌రిధిలోని ష‌హ‌ర్‌పుర్ లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు దిగింది. దీంతో అత్యవసర సమావేశం నిర్వహించగా, మ‌నోహ‌ర్ పారిక‌ర్‌తో భార‌త‌ త్రివిధ ద‌ళాధిపతులు, మిలిటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌(డీజీఎంవో) రణబీర్‌ సింగ్, ఎన్ఎస్ఏ అధికారులు పాల్గొన్నారు. స‌రిహ‌ద్దుల్లో ప్ర‌స్తుత ప‌రిస్థితిపై ఎన్ఎస్ఏ వివ‌రిస్తోంది. మరోపక్క హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ సరిహద్దులోని నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నాడు.

Rajnath Singh Manohar Parikar review meeting

కాగా, రాత్రి బారాముల్లా సమీపంలోని 46 రాష్ట్రీయ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసిన ఉగ్రవాదులు జీలం నదిలో దూకి పారిపోతుండటాన్ని సైన్యం పసిగట్టింది. దీంతో వారిని ప్రాణాలతో పట్టుకునేందుకు ఆర్మీ కమాండోలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ప్రస్తుతం నదిలో స్పీడ్ బోట్లతో గాలిస్తున్నారు. ఉగ్రవాదులు వినియోగించిన జీపీఎస్, కాంపాస్, ఫెన్సింగ్ కట్టర్, ఏకే 47 మ్యాగజైన్ లను దాడి జరిపిన ప్రాంతంలోనే వదిలి వీరు పరారుకాగా, వాటన్నింటినీ సైన్యాధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వీటిలోని వివరాలను బట్టి ఉగ్రవాదులు పాక్ నుంచే చొరబడ్డారని గుర్తించారు. ఇక వీరు తెల్లవారుఝామున తప్పించుకుని పారిపోయినట్టు గుర్తించిన సైన్యం, జీలం నదికి ఆనుకొని ఉన్న గ్రామాల్లోని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో వారు నది మార్గంలో పాక్ వైపు వెళుతున్నారని గుర్తించి వారిని వెంటాడటం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఛేజింగ్ ఇంకా కొనసాగుతూనే ఉందని అధికారులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baramulla  Ceasefire  India  Pak  fires  Manohar Parrikar  Rajnath Singh review  

Other Articles