పొలవరంతో లెక్కల్లో ‘నో’ బొక్కలు | AP govt submit statistics to central on Polavaram Project

Ap govt submit statistics to central on polavaram project

AP govt submit statistics on Polavaram, Polavaram estimation and Statistics, Polavaram Project updates, Chandrababu too much concentration on Polavaram, Polavaaram for Chandrababu, Chandrababu review on polavaram

AP govt submit statistics to central on Polavaram Project.

పోలవరం లెక్కల్లో బొక్కలు లేనే లేవన్నమాట!

Posted: 09/28/2016 01:09 PM IST
Ap govt submit statistics to central on polavaram project

దేశ చరిత్రలోనే ఎక్కడా కట్టలేదని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్న పోలవరం విషయంలో లెక్కలపై కేంద్రానికి ప్రభుత్వం నివేదిక సమర్పించింది. దాదాపు 40 శాతం పనులు పూర్తయ్యాయంటూ చెబుతూ గణాంకాలతో సహా వివరాలను తెలియజేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్టు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ మేరకు పనులపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఉద్దేశం, ఇప్పటి వరకు చేపట్టిన పనులు, ఖర్చులు, తుది గడువు తదితర వివరాలతో కూడిన నివేదికను కేంద్రానికి ఇచ్చింది. ప్రాజెక్టును మార్చి, 2018 నాటికి పూర్తిచేయనున్నట్టు నివేదికలో పేర్కొంది. ఇంకా ఆ రిపోర్టులోని కొన్ని అంశాలను పరిశీలిస్తే.... పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. కేంద్ర అటవీ, పర్యావరణ, గిరిజన తదితర ఎనిమిది చట్టబద్ధ అనుమతులు లభించాయి. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టును పూర్తిచేయడం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అలాగే 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విశాఖపట్నంలోని 28.5 లక్షల మందికి తాగునీరు అందించడమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలు కూడా వరుసగా 21, 14 టీఎంసీల నీటిని పొందుతాయి. 2454 మీటర్ల పొడవైన డ్యామ్‌లో 1128.40 మీటర్ల గేట్ల పొడవు, 25.72 మీటర్ల ఎత్తైన 48 గేట్లు ఉంటాయి. 50 లక్షల క్యూసెక్కుల వరదను సైతం ప్రాజెక్టు తట్టుకుంటుంది. 75.20 టీఎంసీల నీటిని ప్రాజెక్టు జలాశయం నిల్వచేయగలదు. విశాఖపట్నం వరకు వెళ్లే ఎడమ కాలువకు 10,661.77 ఎకరాలు అవసరం కాగా 97.34 శాతం భూసేకరణ పూర్తయింది. అలాగే 60 శాతం పనులు పూర్తయ్యాయి. కృష్ణానది వరకు వెళ్లే కుడి కాలువ పొడవు 177.90 కిలోమీటర్లు. దీనికి మొత్తం 12,251.77 ఎకరాలు అవసరం కాగా భూసేకరణ పూర్తయింది. 80 శాతం పనులు పూర్తయ్యాయి.

2010-11 ధరల ప్రకారం ప్రాజెక్టు మొత్తం వ్యయం 16,010.45 కోట్లు కాగా ఈ ఆగస్టు నాటికి రూ.8391.86 కోట్లు ఖర్చయ్యాయి. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత రూ.2,843 కోట్లు ఖర్చయ్యాయి. కేంద్రం ఇంకా రూ.1893.07 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. జలాశయం సహా ప్రాజెక్టు కోసం ఇంకా 1,00,593.90 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టుతో ముంపు 1,87,187 మంది జనాభాపై ప్రభావం చూపనుంది. అయితే ఈ బహుళార్థక ప్రాజెక్టు ద్వారా జరిగే నష్టంను పట్టించుకోకుండా ఉంటే... భవిష్యత్ అవసరాలు తీర్చుకోగలమని, కరువు ఉండబోదని ముఖ్యమంత్రి చంద్రబాబు వాదిస్తున్నాడు.

రాజధానికి, పోలవరానికి సంబంధించి నిధుల విషయంలో నివేదికలు ఇవ్వకుండా, మాట మీద అంకెల గారడీతో నిధులు కేటాయించడటం పై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో, తానే స్వయంగా రంగంలోకి దిగి వెంకయ్య నాయుడితో మంతనాలు జరిపి మరీ ముందుకు వెళ్తున్నాడు చంద్రబాబు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై ప్ర‌తివారం(సోమవారాన్ని పోలవారంగా ఆయన మార్చుకున్నారు లేండి) తాను స‌మీక్షిస్తున్న‌ట్లు ప్రకటించాడు కూడా. సవాళ్లను ఎదుర్కుంటూనే ఎట్టి పరిస్థితుల్లో 2018లోపు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Polavaram  AP govt  submit  report  Statistics  

Other Articles