అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న గన్ కల్చర్ స్థానికులను కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ సాయుధ కల్చర్ పై ఇటీవల స్వయంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా అందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు సాయుధుడు గడగడలాడించిర విషయం తెలిసిందే. అమెరికాలోని వాషింగ్టన్ లోని ఓ మాల్ లో విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఐదుగురిని హత్య చేసిన ఘటనలో పోలీసులు అనుమానితుడిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ స్టేట్ పెట్రోల్ విభాగం పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
సీటిల్ నగరానికి ఉత్తరంగా ఉన్న బర్లింగ్టన్‌లోని మాల్‌లోని కాస్కేడ్ మాల్ లో కాల్పులకు దిగిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం అతడిని ప్రశ్నిస్తున్నామని వివరించారు. దాడి అనంతరం అక్కడి సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, తుపాకీ ధరించిన వ్యక్తి కనిపించాడు. ఆపై మరో పది నిమిషాల తరువాత రోడ్డుపై అతను నడిచి వెళుతున్న ఫుటేజ్ లభించింది వీటి ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు, ఈ ఘటన స్థానికంగా పెను కలకలాన్ని రేపింది. కాల్పుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.
1990లో బర్లింగ్టన్‌లో ప్రారంభమైన కాస్కేడ్ మాల్‌లో జేసీ పెన్నీ, టీజే మాక్స్, మేసీస్ స్టోర్స్, మరికొన్ని స్టోర్లు, రెస్టారెంట్లు, ఒక థియేటర్ ఉన్నాయి. దీంతో వీకెండ్ రోజులతో పాటు పనిదినాల సాయంకాల వేళల్లోనూ షాపింగ్ మాల్ కు స్థానికులు బాగానే వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఉన్నట్టుండి కాల్పులు జరగడంతో అంతా భయభ్రాంతులకు లోనయ్యారు. గన్ కల్చర్ గురించి విపరీతంగా చర్చలు నడుస్తున్న తరుణంలో మళ్లీ కాల్పులు జరగడం సంచలనం సృష్టించింది. అయితే ఇది ఉగ్రవాద చర్యా..? లేదా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more