హైదరాబాద్ కి మరో హెచ్చరిక | High Alert In Hyderabad Over Heavy Rains

High alert in hyderabad over heavy rains

High Alert In Hyderabad Over Heavy Rains, Meteorological Department Report alert Hyderabad, High Alert In Hyderabad Over Heavy Rains

High Alert In Hyderabad Over Heavy Rains Meteorological Department Report.

ITEMVIDEOS:ముంచుకొస్తున్న మరో ముప్పు.. హెవీ స్పెల్స్ హెచ్చరికలు

Posted: 09/23/2016 09:57 AM IST
High alert in hyderabad over heavy rains

ఇప్పటికే ఎడతెరపిలేని భారీ వర్షాలతో అతలాకుతలం అయిన నగరానికి మరో హెచ్చరిక జారీ అయ్యింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రరూపం దాల్చింది. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆ తర్వాత మరో మూడు రోజులు ఒక మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అల్పపీడనంతో రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి నుంచే ‘అసలు’ వర్షాలు మొదలయ్యాయని తెలపటం విశేషం.

ఇక తక్కువ సమయంలో అతి భారీ వర్షం (హెవీ స్పెల్స్) కురిసే అవకాశముందని వారు హెచ్చరించారు. రోజంతా పడాల్సిన వర్షం కేవలం రెండు మూడు గంటల వ్యవధిలోనే పడే అవకాశం ఉందని, ఏకంగా 7 సెంటీమీటర్ల వర్షపాతం నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని వారు సలహా ఇస్తున్నారు. హుస్సేన్ సాగర్ డేంజర్ లెవల్ లో పూర్టిస్థాయి నీటిమట్టం చేరటంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి.

జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధుల పాత్ర ఉండేలా ఆయన చూసుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. హైదరాబాదు నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తడంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. కాస్త తెరిపిస్తే నగర వాసులు నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు, విధులకు హాజరయ్యేందుకు ఇళ్ల నుంచి బయటకు వస్తుండడంతో, హైదరాబాదు చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొన్నిరూట్ లలో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నేడు, రేపు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

 

అలాగే కీలకమైన ఐటీ పరిశ్రమ ఉద్యోగులకు ఈ రెండు రోజులు ఇంటి నుంచి విధులు నిర్వర్తించే అవకాశం కల్పించాలని జీహెచ్ఎంసీ అధికారులు ఐటీ కంపెనీలకు సూచించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఇంటి నుంచి పని చేయడమే ఉద్యోగులకు మంచిదని వారు కోరారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సముచిత నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాగా, వీకెండ్ కావడంతో వివిధ ఐటీ కంపెనీలు సెలవు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో వారాంతపు సరదాలకు దూరంగా ఉండి, జీహెచ్ఎంసీకి సహకరించాలని అధికారులు నగరవాసులను కోరారు.

నైరుతి రుతుపవనాలు మొదలైన జూన్ నెలలో 50 శాతం అధిక వర్షపాతం నమోదుకాగా.. జూలైలో 3 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. ఆగస్టులో మాత్రం 42 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మళ్లీ ఈ నెల (సెప్టెంబర్) ఒకటో తేదీ నుంచి గురువారం వరకు 22 రోజుల్లో సాధారణం కంటే 120 శాతం అధిక వర్షపాతం నమోదుకావడం గమనార్హం. ఈ 22 రోజుల్లో సాధారణంగా 98.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా.. 217.2 మిల్లీమీటర్లు రికార్డయింది. హైదరాబాద్‌లోనైతే ఏకంగా 361 శాతం అధికంగా నమోదైంది.

మరో వైపు ఏపీ లోనూ వర్షాల దాటికి భారీ నష్టమే సంభవిస్తోంది. గుంటూరు, కడప, కృష్ణా జిల్లాలో వర్షాలకు అతలాకుతలం అయిపోతున్నారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చటంతో వరదలతో కొన్ని గ్రామాలు నీటమునిగాయి. రవాణా సదుపాయాలు కూడా దెబ్బతిని కమ్యూనికేషన్ వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High Alert In Hyderabad  Heavy Rains  Telangana  Andhra Pradesh  

Other Articles