ప్రత్యేక హోదాపై చేతులెత్తేసి ప్యాకేజీ వరంతో సరిపెట్టిన బీజేపీ ఇప్పుడు ఏపీ ప్రజలను ఏమార్చే ప్రయత్నంలో పడ్డారు. అందుకోసం అభినందన, కృతజ్నత సభలు, తీర్మానాలు, అడ్వర్టైజ్ మెంట్ లు అబ్బో ఇలా చాలానే జరుపుతున్నారు. పనిలో పనిగా శనివారం విజయవాడకు వచ్చిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిమంత్రి వెంకయ్యనాయుడు ఓ అడుగు ముందుకే వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ‘స్పష్టత లేని ప్యాకేజీ’పై ప్రజలు సానుకూలంగానే ఉన్నారంటూ ఆయనకు జరిగిన అభినందన సభలో తేల్చేశారు.
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవ్వగానే మంత్రులు కామినేని శ్రీనివాస్, పి.మాణిక్యాలరావుతోపాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి సన్మాన వేదిక దాకా వెంకయ్య వాహనంలో ర్యాలీగా సాగగా, చుట్టూ విద్యార్థులతో పూల చల్లించడం, నినాదాలు చేయించడం లాంటి ఫీట్లు చాలానే చేయించారు బీజేపీ నేతలు. ఆపై సభ వేదికకు చేరుకున్న వెంకయ్య ప్రసంగం చూస్కోండి.
ప్యాకేజీపై విమర్శలను కొట్టిపడేసేందుకు విజయవాడ వచ్చానని చెప్పుకున్న ఆయన, బీజేపీ నిర్ణయాన్ని స్వాగతించడం ద్వారా నేతల కంటే ఏపీ ప్రజలు తెలివైన వారని మరోసారి రుజువు చేశారని చెప్పుకోచ్చారు. ఈ సందర్భంగా ఇతర రాష్ట్రాల ప్యాకేజీలు ఎందుకిచ్చాయో చెబుతూ కాస్త గందరగోళమే నెలకొల్పారు. దేశ సరిహద్దు, కొండ ప్రాంతాల్లోని రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇచ్చారని... అంతేకాని మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ప్యాకేజీపై అవగాహన కల్పించేందుకే తాను ఇక్కడికొచ్చానని చెప్పిన, అది ఎలాగో మాత్రం చెప్పలేకపోయారు. పైగా, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు ఎంత వరకు అభివృద్ది చెందాయో పరిశీలించాలని చెబుతూ పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు ఆంధ్రులు మేధావులని... వారు ఎక్కడ ఉన్న రాణిస్తారని ఇలా మరికాసేపు సంబంధం లేకుండానే మాట్లాడారు.
ఇక మ్యాటర్ పక్కదారి పట్టించాలనుకున్నారో ఏమో హోదా వ్యవహారంలోకి కాంగ్రెస్ ను లాగేశాడు. విభజన నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేయటం దాకా అన్ని అంశాలను లేవనెత్తాడు. ఆధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విభజించారన్న వెంకయ్య, నాడు ఒక్క ప్రత్యేక హోదా గురించే మాట్లాడలేదని చెబుతూ తాను ఒక్కడిని మాత్రమే ఏపీకి న్యాయం చేయాలని వాదించానని ఉటంకించారు. టీవీ ప్రసారాలు ఆపి..తమ పార్టీ సభ్యులను గెంటేసి..పార్లమెంట్ తలుపులు మూసేసి విభజన చేశారని వెంకయ్య విమర్శించారు. జైరాం రమేష్‌తో ఏడు రోజుల పాటు చర్చించానని, ప్రత్యేక హోదాతో పాటు న్యాయం చేసే అంశాలకు చట్టబద్ధత కల్పించాలని కోరినా వారు స్పందించలేదని ఆయన ఆరోపించారు. పాపం కాంగ్రెస్ చేస్తే.. నింద నాపై మోపారని, కాంగ్రెస్ నేతలు ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని, ఇప్పుడు నిపుణులు కూడా హోదా ఇవ్వటం సాధ్యం కాదని తేల్చేశారని ఓవరాల్ గా ఓ కంక్లూజన్ ఇచ్చేశారు వెంకయ్య.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more