మోదీపై షాకింగ్ సమాధానమిచ్చిన స్టూడెంట్స్ | Government school students think Modi their MLA.

Jabalpur govt students shocking reply on modi

Government school students Jabalpur, Jabalpur Government school students, Jabalpur students on Modi, Modi MLA, Jabalpur MLA Modi, Modi becomes MLA, students think PM Modi their MLA

Government school students of Jabalpur think PM Narendra Modi is their district MLA.

ప్రధాని మోదీ ఏ ఊరి ఎమ్మెల్యేనో తెలుసా?

Posted: 09/13/2016 12:12 PM IST
Jabalpur govt students shocking reply on modi

విద్యార్థుల టాలెంట్ ఏపాటిదో తెలుసుకుందామని వచ్చిన అధికారులకు ఊహించని పరిణామం ఎదురైంది. మీ ఎమ్మెల్యే ఎవరు ? అని అడిగిన పాపానికి షాకిచ్చే రిప్లై వారి నుంచి రావటంతో ఏం చేయాలో తెలీయక అధికారులు కాసేపు అల్లలాడిపోయారు.

మధ్యప్రదేశ్‌ లోని జబల్‌ పూర్‌ జిల్లాలోని కోహ్లా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూల్లో తనిఖీలకు విద్యాశాఖాధికారులు వచ్చారు. ఈ సందర్భంగా ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులను మన జిల్లాకు చెందిన రాజకీయ నాయకుల పేర్లు చెప్పండని అడిగారు. వెంటనే తమ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నరేంద్ర మోదీయేనని విద్యార్థులంతా ముక్తకంఠంతో చెప్పారు. దీంతో షాక్ తిన్న అధికారులు, వారిని వారాల స్పెల్లింగులు చెప్పాలని కోరారు. ఒక్కరు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు.

దీంతో అధికారులు ఉపాధ్యాయులను ప్రశ్నించగా, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, విద్యార్థుల తల్లిదండ్రులు మెరుగైన ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్లిపోతున్నారని, దీంతో విద్యార్థులు చదువులో వెనకబడిపోతున్నారని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు మౌనంగా వెళ్లిపోయారు.

ఇక ఆపైనే అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ కోహ్లా సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద రెండేళ్ల క్రితం దత్తత తీసుకున్నారు. ఆ సందర్భంలో ఆయన ఈ స్కూలును ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. దీంతో విద్యార్థు ప్రతిభ ఇంతగా పెంచారంటూ స్థానిక మీడియాలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jabalpur  MLA  PM Modi  Govt students  

Other Articles