ముందస్తు అనుమతులు లేకుండా, తమ ఇష్టానుసారం తాము కొనుగోలు చేసిన ఫ్లాట్లలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇద్దరు నటులు చిక్కులను కొనితెచ్చుకున్నారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్, కమెడియన్ కపిల్ శర్మ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుందన్న వార్తలు తాజాగా బాలీవుడ్ వర్గాలను అందోళనకు గురిచేస్తున్నాయి. తమ ప్లాట్లలో చేపట్టిన అక్రమ నిర్మాణాల నేపథ్యంలో ఈ ఇద్దరు నటులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వారి అభిమాన వర్గాలు అందోళన చెందుతున్నాయి.
దోషులుగా తేలితే వీరికి గరిష్టంగా మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశముందని న్యాయవర్గాలు ప్రకటించాయి. ఈ ఇద్దరు నటులు ముంబైలోని గోరేగావ్ బిల్డింగ్‌లోని డీఎల్హెచ్ ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్నారు. అపార్ట్మెంటులోని 9వ అంతస్తులో కపిల్ శర్మ, ఐదో అంతస్తులో ఇర్ఫాన్ ఖాన్ అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గురించిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. వీరిద్దరితో పాటు మొత్తంగా 15 మంది అక్రమంగా నిర్మాణాలు జరిపిందని గుర్తించిన నగర పాలక సంస్థ వారిపై చర్యలకు కూడా ఉపక్రమించింది.
అపార్టుమెంట్లలో చేపడుతున్న ఈ అక్రమ నిర్మాణాలపై పీ-సౌత్ వార్డ్ సబ్ ఇంజినీర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అపార్ట్ మెంట్ యజమాని, ఫ్లాట్ ఓనర్లపై మహారాష్ట్ర రీజినల్ టౌన్ ప్లానింగ్ యాక్ట్(ఎంఆర్ టీఎస్) 1996 కింద కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో దోషులుగా తేలిన వారికి నెల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 వేలు నుంచి రూ.5 వేలు జరిమానా విధిస్తారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more