జియోకి పోటీగా ఆఫర్ ప్రకటించిన అనిల్ అంబానీ | Reliance Communication announced 1 GB free data plan

Reliance communication announced 1 gb free data plan

Reliance Communication competition for Jio, Reliance Communication 1 GB free data plan, 1 GB free data plan from RC, Reliance vs Reliance, 1 GB free data for reliance prepaid

Reliance Communication announced 1 GB free data plan on 40 recharge.

రిలయన్స్ జియోకి ఎర్త్ పెడుతుంది ఎవరో తెలుసా?

Posted: 09/12/2016 02:43 PM IST
Reliance communication announced 1 gb free data plan

రిలయన్స్ జియో ఆల్ ఫ్రీ ఆఫర్ తో ఒక్కసారిగా మొబైల్ రంగంలో సంచలనాలకు తెరలేపి మిగతా నెట్ వర్క్ లను దారుణంగా దెబ్బకొట్టాడు దాని అధినేత ముకేష్ అంబానీ. ఉచితకాల్స్, హైస్పీడ్ ఇంటర్నెట్ అంటూ ఆఫర్లతో మొండి టెల్కోలు సైతం తగ్గించే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ క్రమంలో కూసింత ముందుగానే తన స్టైల్లో తగ్గింపు రేట్లను ప్రకటించేసి, జియోకి పోటీ ఇవ్వాలని చూస్తున్నాడు ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేతగా ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుతం ఓ కొత్త ఆఫర్ ను ప్రకటించారు. రిలయన్స్ సిమ్ వాడుతున్న ప్రీపెయిడ్ జీఎస్ఎం ఖాతాదారుల కోసం రూ. 40 రీచార్జ్ తో పూర్తి టాక్ టైం, 1 జీబీ డేటాను అందించనున్నట్టు వెల్లడించారు. గతంలో రూ. 40తో రిలయన్స్ సిమ్ ను రీచార్జ్ చేసుకుంటే రూ. 32 టాక్ టైం వచ్చేది. కానీ, ఇప్పటి నుంచి పూర్తి టాక్ టైంతోపాటు, వన్ జీబీ అదనంగా రానుంది. ఇక ఎక్స్ ట్రా టాక్ టైం రూ. 8 టాక్ టైంను పది రోజుల్లో వాడుకోవాల్సి వుంటుందని ప్రకటించేశారు.

ఇక ఈ టాక్ టైం ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు కాగా, 1 జీబీ డేటాను పూర్తి ఉచితంగా ఇస్తామని ప్రకటించిన తొలి సంస్థ ఆర్ కామ్ కావడం విశేషం. మొత్తానికి అన్న అన్నే... యాపారం యాపారమే అని ముకేష్ ప్రకటించిన ఈ ఫ్రీ ఇంటర్నెట్ ఆఫర్ కి మొబైల్ వినియోగదారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Reliance Communication  Mukesh Ambani  40 recharge  1 GB free Data  

Other Articles