మహిళా పోలీసుపై ఎస్ఐ అత్యాచారం.. si arrested for molesting women police in tamilnadu

Si arrested for molesting women police in tamilnadu

rama lakshmi, arumai nayagan, seeda parsanallur police station, sub inspector, allangulam dsp office, inspector naga devi, ambai womens police station, harrassment of women, sexual assult on women, molestation on women, violence on women, crime

A sub inspector arumai nayagan of tamilnadu has been held for molesting women police in thiruneli district of tamil nadu.

మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ అత్యాచారం

Posted: 09/08/2016 01:53 PM IST
Si arrested for molesting women police in tamilnadu

మహిళా పోలీసుపై అత్యాచారం జరిపిన కేసులో ఓ ఎస్ఐ కటకటాలపాయ్యాడు. తననుపెళ్లి పేరుతో మోసం చేసి ఆపై అత్యాచారం జరిపిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను అంభై మహిళా పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. తిరునెల్వేలి జిల్లా పొపట్టలైకు చెందిన రామలక్ష్మి (29) మహిళా పోలీసు అయిన ఈమె ఆలంకులం సమీపంలోగల సీద పర్సనల్లూర్‌ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఈమె గత 2014లో కేసులకు సంబంధించిన ఫైల్స్‌ విషయంలో తరచూ ఆలంగులం డీఎస్పీ కార్యాలయానికి వెళుతుండేది.

ఆ సమయంలో అదే పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న వీరకోరలంపుదూర్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ అరుమై నాయగన్‌ (35)కు, రామలక్ష్మికి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో అరుమై నాయగన్‌ తనకు అప్పటికే వివాహం జరిగిన విషయాన్ని దాచి రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఆమెపై అత్యాచారం జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అరుమై నాయగన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పరీక్ష రాసి చెన్నైలో గల పోలీసు ట్రైనింగ్‌ కళాశాలకు వెళ్లాడు.

దీంతో రామలక్ష్మితో ఉన్న సంబంధాన్ని క్రమేపి తగ్గించుకునేందుకు యత్నించాడు. దీంతో రామలక్ష్మికి అనుమానం కలిగింది. ఈ క్రమంలో అరుమైనాయగన్‌కు అంతకుముందే వివాహం జరిగిన విషయం తెలిసి రామలక్ష్మి తనకు న్యాయం చేయాలని అరుమైనాయగన్‌ ను నిలదీసింది. దీంతో అతడు ఆమెను బెదిరించడంతో రామలక్ష్మి ఈ విషయాన్ని అంబై మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ నాగదేవి, పోలీసులు విచారణ చేసి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుమై నాయగన్‌పై కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rama lakshmi  arumai nayagan  molestation  si molests women police  Tamil Nadu  

Other Articles