నడిగర్ సంఘ సభ్యుడిపై విశాల్ పిటిషన్ | hero vishal petition against varahi in madras high court

Hero vishal petition against varahi in madras high court

Hero vishal petition in Madras High Court, Nadigar Sangam member varahi, Vishal varahi, Hero vishal petition, Vishal petition in HC, Vishal in madras high court

Hero vishal petition against Nadigar Sangam member varahi in madras high court.

వారాహి పై హైకోర్టులో హీరో విశాల్ పిటిషన్

Posted: 09/08/2016 09:48 AM IST
Hero vishal petition against varahi in madras high court

సినీ హీరో, తమిళ నడిఘర్ సంఘ కార్యదర్శి విశాల్ బుధవారం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆవరణలో జరిగిన వివాదంపై పోలీసులు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. సంఘంలో సభ్యుడైన వారాహి గొడవకు దిగినా పోలీసులు పట్టించుకోవటం లేదంటూ అందులో విశాల్ పేర్కొన్నాడు.

అసలు విషయం ఏంటంటే... సంఘంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల గురించి సంఘ సభ్యుడైన వారాహి వివరాలు కోరుతూ మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండుమార్లు లేఖలు రాశారని తెలిపారు. అతడి ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు గతనెల 27న కార్యాలయానికి రావాలని చెప్పడంతో వచ్చిన ఆయన.. కార్యవర్గ సభ్యులు, న్యాయసలహాదారుడితో మాట్లాడేందుకు నిరాకరించారని విశాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఆ తర్వాత వారాహి నేరుగా మీడియాతో మాట్లాడుతూ సంఘంపై పలు ఆరోపణలు చేశారని తెలిపారు. అది సరికాదని వారించినందుకు సంఘ సభ్యులను బెదిరించాడని పేర్కొన్నారు. ఈ ఘటనపై తేనాంపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి, వారాహిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించాలని పిటిషన్‌లో విశాల్ అభ్యర్థించారు. పిటిషన్‌పై కోర్టు త్వరలో విచారించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Madras High Court  Nadigar Sangam  Varahi  

Other Articles