ఈఎస్ఐ వేతన పరిమితిని పెంచిన కేంద్రం ESIC hikes monthly wage threshold to Rs 21,000

Esic hikes monthly wage threshold to rs 21 000

Wages, Economy, ESIC, Employees State Insurance Corporation, Bandaru Dattatreya, wage hike, EPFO, Employees Provident Fund Organisation, Digital India

The Employees' State Insurance Corporation raised the monthly wage threshold to Rs 21,000, from the current Rs 15,000, for coverage under its health insurance scheme.

ఈఎస్ఐ వేతన పరిమితిని పెంచిన కేంద్రం

Posted: 09/07/2016 11:02 AM IST
Esic hikes monthly wage threshold to rs 21 000

కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఉద్యోగుల ప్రభుత్వ భీమా సంస్థ తన అరోగ్య భీమాను మరింత సంఘటితం చేసేందుకు చర్యలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా 50 లక్షల మందికి లబ్ది కలిగేలా ఈఎస్ఐ పరిమితిని రూ. 21 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈఎష్ఐ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఇప్పటి వరకు వున్న 15 వేల బేసిక్ వేతనాన్ని ఏకంగా అరు వేల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

దీంతో ఈఎస్ఐ గోడుకు కిందకు మరో 50 లక్షల మంది కార్మికులు రానుండగా, వారిపై అధారపడిన సుమారు రెండు కోట్ల మంది కుటుంబసభ్యులకు కూడా ఈ సౌకర్యం లభించనుందని ఈఎస్ఐసీ బోర్డు భేటీ అనంతరం కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. తొలుత ఈ పరిమితిని రూ. 25 వేలకు పెంచాలని ప్రతిపాదించామని, చివరికి రూ. 21 వేలకు పెంచామని ఆయన అన్నారు. పెరుగుతున్న ధరలు, వేతనాల వృద్ధి తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయేతర నైపుణ్యంలేని కార్మికుల కనీస వేతనాన్ని 42 శాతం మేర పెంచి రోజుకు రూ. 350 చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఐసీ వేతన పరిమితిని 40 శాతం పెంచింది. దీంతో సమానంగా ఈఎస్ఐ సౌకర్యాన్ని అందుకునే వారి పరిధిని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ కార్మికుని వేతనంలో 4.7 శాతాన్ని, దీనికి అదనంగా కార్మికుల వేతనం నుంచి 1.75 శాతాన్ని ఈఎస్ఐసీకి చెల్లించాల్సి వుంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ESI  Employees State Insurance Corporation  Bandaru Dattatreya  wage hike  EPFO  Employees  

Other Articles