ED attaches Vijay Mallya's properties and shares worth Rs 6600 crore

Ed attaches vijay mallya s assets worth rs6 630 crore

Vijay Mallya, USL, UBL, Kingfisher Airlines, Government, Economic terrorist, money laundering case, Enforcement Directorate

The ED issued its second attachment order for assets worth Rs 6,630 crore against beleaguered businessman Vijay Mallya as it seized his farmhouse, flats and FDs in connection with its money laundering case against him and his associates.

విజయ్ మాల్యాకు ఈడీ భారీ షాక్..

Posted: 09/03/2016 06:12 PM IST
Ed attaches vijay mallya s assets worth rs6 630 crore

బ్యాంకులకు వేలకోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టి బ్రిటన్ కు పారిపోయిన పారిశ్రామిక వేత్త విజయ మాల్యాకు  ఈడీ భారీ షాక్ ఇచ్చింది.    మాల్యాకు చెందిన వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ఎటాచ్ చేసింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తొమ్మిది వేల కోట్లకు పైగా రుణ ఎగవేతదారుడు, లిక్కర్  కింగ్ మాల్యాపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  ఈ  చర్యలకు దిగింది.  విజయ్‌ మాల్యాకు చెందిన రూ.6,630 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.  

2010 లో రూ. 4200 కోట్ల రుణ ఎగవేత కేసులో ఈడీ ఈ ఆస్తులను ఎటాచ్ చేసింది. ముంబయి, బెంగళూరు సహా ఇతర ప్రాంతాల్లోని  ఆయన అస్తులు, యునైటెడ్ బ్రవెరీస్ లిమిటెడ్, యునైటెడ్ స్పిరిట్స్ కు చెందిన షేర్లను అటాచ్‌ చేసినట్లు ఈడీ తెలిపింది. కింగ్ ఫిషర్ టవర్ లో రూ.565 కోట్ల విలువ అపార్ట్ మెంట్లు, మాండ్వా లోని  రూ.25 కోట్ల ఫామ్ హౌస్, రూ .10 కోట్ల యుఎస్ఎల్ షేర్లు, ఒక ప్రైవేట్ బ్యాంకుకు చెందిన  మాల్యా ఫిక్స్డ్ డిపాజిట్లు, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, యూబీఎల్ కంపెనీ  రూ 3,635 కోట్ల విలువ  షేర్ల ఈ ఎటాచ్ మెంట్ లో  ఉన్నాయి.

అటు 2010  మార్కెట్ విలువ ప్రకారం ఈడీ ఆస్తుల విలువను అంచనా వేసినట్టు సమాచారం. ప్రస్తుత ఈడీ అంచనాల ప్రకారం  వీటి విలువ సుమారు రూ. 4,234.84 కోట్లు. అయితే ప్రస్తుత  మార్కెట్ల విలువ ప్రకారం రూ.6,630 కోట్లు ఉంటుందని అంచనా. కాగా గతంలో 1400 కోట్లను ఈడీ అటాచ్ చేసిందనీ, ఐతే అతిపెద్ద ఎటాచ్ మెంట్ అని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay Mallya  USL  UBL  Kingfisher Airlines  Government  

Other Articles