PV Sindhu, Yogeshwar Dutt, Dipa Karmakar find themselves in Rio controversy

Pv sindhu into controversy of rio olympics

PV Sindhu, Yogeshwar Dutt, Dipa Karmakar, Li Ning, official apparel sponsor, Kidambi Srikanth, Rio controversy, Rio Olympics, Olympics news

Li Ning has brought it to Indian Olympic Association's notice that several Indian athletes violated a sponsor agreement during the recently concluded Rio Olympics.

వివాదంలో చిక్కుకున్న రియో పతక విజేతలు

Posted: 09/03/2016 10:01 AM IST
Pv sindhu into controversy of rio olympics

125 కోట్ల మంది భారతీయుల తరపున ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఒలంపిక్స్ పోటీలలో కేవలం ఇద్దరు అమ్మాయిలు మాత్రమే పతకాలను సాధించి.. భారత్ కీర్త ప్రతిష్టలను రెపరెపలాడించిన సందర్భాన్ని ఇంకా భారతీయులు అస్వాదిస్తున్న తరుణంలోనే దానిని కూడా వివాదాస్పదం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రియో ఒలింపిక్స్ లో భారత సత్తా చాటుతూ రజత పతకాన్ని సాధించిన తెలుగు తేజం పీవీ సింధుతో పాటు కాంస్య పతక విజేత సాక్షి మాలిక్ ను కూడా వివాదంలోకి లాగుతున్నారు.

వీరిద్దరితో పాటు రెజ్లర్ యోగేశ్వర్ దత్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు. సదరు వివాదం పెద్దదేమీ కాకున్నా... స్పాన్సర్లతో కుదిరిన ఒప్పందాలను ధిక్కరిస్తూ వారు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తేలానే ఉన్నాయి. వివరాల్లోకెళితే... రియో ఒలింపిక్స్ కు సంబంధించి భారత ఒలింపిక్ సంఘంతో ‘లీ నింగ్’ అనే సంస్థ ఒప్పందం చేసుకుంది.

రూ.3 కోట్లను భారత ఒలింపిక్ సంఘానికి ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సదరు సంస్థ... రియోలో భారత క్రీడాకారులంతా తమ బ్రాండ్ దుస్తులనే వాడాలని షరతు పెట్టింది. అయితే పీవీ సింధు, దీపా కర్మాకర్, యోగేశ్వర్ దత్, కిడాంబి శ్రీకాంత్ లు పలు మ్యాచ్ ల్లో లీ నింగ్ బ్రాండ్ దుస్తులు కాకుండా ఇతర కంపెనీలవి వాడారట. దీనిపై లీ నింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ భారత ఒలింపిక్ సంఘానికి లేఖ కూడా రాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles