తెలంగాణ విద్యా వ్యవస్థపై నరసింహన్ అసంతృప్తి | Governor Narasimhan on telangana education system

Governor narasimhan on telangana education system

Governor Narasimhan comments on KCR, Narasimhan on telangana education system, narasimhan on KCR speed comments, Narasimhan sesnsational comments on KCR

Governor Narasimhan on telangana education system, says KCR speed up policy.

ఆ విషయంలో కేసీఆర్ పై నరసింహన్ అసంతృప్తి

Posted: 09/02/2016 05:26 PM IST
Governor narasimhan on telangana education system

కేసీఆర్ ప్రభుత్వంపై ఏనాడూ పన్నెత్తి మాట అనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణ ఏర్పడి రెండు సంవత్సరాలు అయింది. ఇంకా చాలా విషయాల్లో ఎంతో మెరుగుపడాల్సి వుంది అంటూ పేర్కొనటం తీవ్రచర్చకు దారితీసింది. కేసీఆర్ స్పీడ్ పెంచండి. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో ఎంతో మార్పు రావాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు. శుక్రవారం  హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్య వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందని, చదువుల తల్లి సరస్వతిని లక్ష్మిగా మారుస్తున్నారని ఆయన ప్రజా ప్రతినిధులుగా ఎంపికైన వారు విద్యార్థినీ విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తున్నామన్న విషయమై దృష్టి పెట్టాలి" అని చెప్పారు. దేశ విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యలో స్కిల్ డెవలప్‌మెంట్ భాగంగా ఉండాలని చెప్పారు. ఇంజినీరింగ్ పాసైన వ్యక్తి అటెండర్ ఉద్యోగం చేయడం కన్నా దురదృష్టకరం మరొకటి ఉండదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోతే మేకిన్ ఇండియా తయారు కాదని, జాగృతి సంస్థ సమాజం మొత్తాన్ని జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కాగా నిరుద్యోగ యువతకు పలు రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ జాగృతి స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆయన ఈ ప్రసంగం చేశారు. కేసీఆర్ వేదికపై లేనప్పటికీ, ఆయన పేరును ప్రస్తావించి మరీ ఈ వ్యాఖ్యలు విశేషం. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రాజీవ్‌ ప్రతాప్ రూడీ ముఖ్య అతిథిగా పాల్గొనగా, అక్కడే ఉన్న కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ ఎంపీ కవిత అదంతా ఆసక్తిగా వినడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Governor  Narasimhan  KCR  telangana education system  

Other Articles