రిలయన్స్ జియో 4జీ ప్లాన్లు మీరూ తెలుసుకోండి | Reliance Jio Will Have Lowest Data Rates in the World and plans

Reliance jio will have lowest data rates in the world and plans

Reliance Jio, Mukesh Ambani Reliance Jio speech, Reliance Jio speech, Mukesh Ambani free mantra, Reliance Jio 4g plans details

Reliance Jio Will Have Lowest Data Rates in the World and plans.

రిలయన్స్ జియో 4జీ ప్లాన్లు మీరూ తెలుసుకోండి

Posted: 09/01/2016 01:44 PM IST
Reliance jio will have lowest data rates in the world and plans

రిలయన్స్ ఇండస్ట్రీస్ 42వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో 4జీ సేవల గురించి ముఖేష్ అంబానీ సుదీర్ఘ ప్రసంగం రాజకీయ సభను తలపించింది. తామందించే పలు రకాల 4జీ సేవలను గురించి ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేనంత తక్కువ ధరలకు డేటా ఆఫర్లు ఇస్తూ, వాయిస్ కాల్స్ పూర్తి ఉచితమని సంచలనానికి తెరదీశారు. ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి డిసెంబర్ వరకు జియో మొబైల్ సేవలను ఉచితంగానే ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక రూ.50 లకే 1 జీబీ డేటాను అందించనున్నట్లు పేర్కొన్న ఆయన... విద్యార్థులకు మరో 25 శాతం అధికంగా డేటాను అందిస్తామన్నారు. ఆయన ఓవైపు మాట్లాడుతున్న వేళ, పోటీ సంస్థలైన భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ ఈక్విటీ వాటాల విలువ పాతాళానికి పడిపోయంటే అది ఎంత ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.


డిజిట‌ల్ ఇండియాకి మరింత బలం:

డిజిట‌ల్ ఇండియా అన్న ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ నినాదానికి రిల‌య‌న్స్ జియో ఊత‌మిస్తుంద‌ని ముఖేష్ అంబానీ అన్నారు. జియో అధునాత‌ర ఇంట‌ర్నెట్ ప్రోటోకాల్ (ఐపీ) టెక్నాల‌జీని ఏర్పాటు చేస్తోందని అన్నారు. ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ నెట్‌వ‌ర్క్‌గా జియో నిలుస్తుంద‌ని ధీమా వ్యక్తం చేశారు.

విద్య, వ్య‌వ‌సాయ రంగాల‌కు కూడా జియో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ముఖేష్ అంబాని చెప్పారు. 4 జీ స్మార్ట్ ఫోన్ల‌ను అందుబాటు ధ‌ర‌కు అందిస్తామ‌ని చెప్పారు. ప్ర‌పంచంలో అన్ని రంగాల్లో స‌మూల మార్పులు వ‌స్తున్నాయని ఆయ‌న అన్నారు. టెక్నాల‌జీ కొత్త శకానికి నాంది ప‌లుకుతుందని వ్యాఖ్యానించారు. ప్ర‌పంచంలో డిజిట‌ల్ విప్ల‌వం వ‌స్తోందని చెప్పారు. 2017 క‌ల్లా భార‌త్‌లోని మొబై ల్‌ ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల్లో 90 శాతం మందిని జియోతో అనుసంధానించేలా ల‌క్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. జియోలో కాల్ డ్రాప్ స‌మ‌స్య‌లు ఉండ‌బోవ‌ని తెలిపారు.

24 ఏళ్ల ఆకాష్, ఈషాల ఆలోచనలతోనే...

రిలయన్స్ జియోలో డైరెక్టర్లుగా ఉన్న తన కుమారుడు ఆకాష్, కుమార్తె ఈషాల మనసులో నుంచి వచ్చిన ఆలోచనలు, డేటా వాడకం దిశగా ఏ మేరకు భారత యువత డబ్బు వెచ్చిస్తుంది? ఎంత డేటా నెలకు సరాసరిన అవసరం అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని జియో డేటా ప్లాన్ లను తయారు చేసినట్టు ముఖేష్ అంబానీ వివరించారు. ఇండియాలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సరాసరి వయసుకు దగ్గరగా ఉన్న 24 ఏళ్ల ఆకాష్, ఈషాలు యువతరానికి ప్రతినిధులని తాను నమ్ముతున్నట్టు షేర్ హోల్డర్ల హర్షధ్వానాల మధ్య ముఖేష్ ప్రకటించారు.

యువత కోసం యువత తయారు చేసిన ఈ డేటా ప్యాక్ లు అందరినీ ఆకర్షిస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలో ఇకపై 'గాంధీగిరి' స్థానంలో 'డేటా గిరి' వస్తుందని, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డేటా చార్జీలతో పోలిస్తే 10 శాతం చార్జీతోనే తాము డేటాను అందిస్తామని తెలిపారు. జియోను వాడేవారిలో అత్యధికులు 30 శాతం కన్నా తక్కువ వయసున్నవారే ఉంటారని అన్నారు. ఇప్పుడున్న ఆపరేటర్లు మార్కెట్ ను మిస్ యూజ్ చేస్తున్నారని, కొత్తగా రంగంలోకి ప్రవేశించాలని భావించే సంస్థలకు అడ్డు తగలాలని ప్రయత్నిస్తున్నారని ముఖేష్ అంబానీ ఆరోపించారు.

 ప్రతి ఒక్క కస్టమర్ కేవలం వాయిస్ లేదా డేటాకు మాత్రమే డబ్బు చెల్లించాలన్నదే తన ఉద్దేశమని చెప్పిన ఆయన, డేటా అందుబాటు ధరల్లో ఉండాలని, ధరా విధానం సరళంగా ఉండాలని చెబుతూ, ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు అత్యధిక డేటాను అందించేది జియో మాత్రమేనంటూ పలు రకాల ప్యాకేజీలను ప్రకటించారు.

ప్యాకేజీలు ఇవే...

ఇందులో భాగంగా స్మాల్ (ఎస్) నుంచి ఎక్స్ ట్రా లార్జ్ (ట్రిపుల్ ఎక్స్ ఎల్) వరకూ ఏడు రకాల డేటా ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్టు చెప్పారు. వాటి వివరాలు ఇవి... (ఈ ప్యాకేజీలన్నీ నాలుగు వారాలకు... అంటే 28 రోజుల వ్యవధికి చెల్లుబాటవుతాయి)

ఎస్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 149. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 0.3 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్ లను పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి సిగ్నల్స్ ఈ ప్యాకేజీకి వర్తించవు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (1) ప్యాకేజీ: టారిఫ్ రూ. 499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 4 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 8 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎం (2) ప్యాకేజీ: టారిఫ్ రూ. 999. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 10 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 20 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 1499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 20 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 40 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 2499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 35 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 70 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఎక్స్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 3499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 60 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 120 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ట్రిపుల్ ఎక్స్ ఎల్ ప్యాకేజీ: టారిఫ్ రూ. 4499. లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితం. 75 జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. రాత్రిపూట అపరిమిత 4జీ డేటా ఉచితం. రోజుకు ఎన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను అయినా పంపుకోవచ్చు. జియో నెట్ వర్క్ అందించే వైఫై టవర్ల నుంచి 150 జీబీ సిగ్నల్స్ వాడుకోవచ్చు. రూ. 1,250 విలువగల జియో యాప్స్ సబ్ స్క్రిప్షన్ ఉచితం.

ఈ ప్యాకేజీల్లో భాగంగా జియో ప్రీమియం యాప్స్ అయిన జియో ప్లే, జియో ఆన్ డిమాండ్, జియో బీట్స్, జియో మ్యాగ్స్, జియో ఎక్స్ ప్రెస్ న్యూస్, జియో డ్రైవ్, జియో సెక్యూరిటీ, జియో మనీ వంటివాటిని డిసెంబర్ 31 2017 వరకూ ఉచితంగా వాడుకోవచ్చు. డేటా ప్యాక్ ల విషయంలో మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ 31 తరువాత తమ టారిఫ్ ప్లాన్ ను కస్టమర్లు ఎంచుకోవాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reliance  Jio  4G  plans  

Other Articles