దాసరి ఇంట్లో కాపు నేతల భేటీ | Kapu Leaders Meeting at Dasari Narayana’s Home for lunch

Kapu leaders meeting at dasari narayana s home for lunch

Kapu leaders in dasari home, Kapu Leaders Meeting at Dasari's home, Mudragada Chiru Dasari, Dasari and Chiru, Chiru and Dasari, Chiru in Dasari House, Kapu meeting In Dasari's House

Kapu Leaders Meeting at Dasari Narayana’s Home for lunch.

ITEMVIDEOS:దాసరి ఇంట్లో కాపు నేతలు ఏం చేశారు?

Posted: 08/30/2016 05:43 PM IST
Kapu leaders meeting at dasari narayana s home for lunch

ఆంధ్రప్రదేశ్ లో కాపు రిజర్వేషన్ల పోరు బాట మళ్లీ తెరపైకి వచ్చింది. కాపు ఐక్యవేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తమ డిమాండ్ల‌ను సాధించుకోవ‌డానికి హైద‌రాబాద్‌లో ప‌లువురు నేతల మ‌ద్ద‌తు కూడ గ‌ట్ట‌డానికి ప్ర‌యత్నాలు జ‌రుపుతూనే ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు నివాసంలో ముద్రగడ ఆధ్వర్యంలో కాపు నేతలు సమావేశమయ్యారు.

అయితే భవిష్యత్ కార్యాచరణ కోసమే వీరంతా భేటీ అయినట్లు చెప్పటినప్పటికీ, కేవలం మర్యాద పూర్వకంగా ఐక్య ఉద్యమ నేత ముద్రగడ గౌరవార్థం లంచ్ కి మాత్రమే కాపు నేతలనంతా ఆహ్వానించినట్లు దాసరి అనంతరం మీడియాకు తెలిపారు. కాపు కీలక నేతలైన ముద్రగడతోపాటు చిరంజీవి, బొత్స, పల్లంరాజు, అంబటితో పాటు ఇతర కీలక నేతలు పాల్గొన్నారు.



కాపు రిజర్వేషన్ సాధన ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒంటరివాడు కాదు అని చెప్పడానికే తామంతా దాసరి నివాసంలో ఏకమయ్యామని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఇచ్చిన హామీనే నెరవేర్చమని చంద్రబాబును కోరుతున్నాం. కానీ, ఇంతవరకు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. అందుకే పోరాటానికి సిద్ధమౌతున్నామని ఆయన తెలిపారు. ఇన్నాళ్లూ ముద్రగడ ఒంటరిగా పోరాడారు.. కానీ, ఇకపై ఆయన వెంట కాపు సమాజం మొత్తం నడుస్తుంది.

వచ్చే నెల 11న అన్ని జిల్లాల కాపు నేతలతో భేటీ కానున్నట్లు కాపు ఉద్యమ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చేవరకూ తాము నిద్రపోయేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకోవాలని ముద్రగడ డిమాండ్ చేశారు.

మరోవైపు ప్రముఖ దర్శక, నిర్మాత, కేంద్ర మాజీమంత్రి దాసరి నారాయణరావు మాట్లాడుతూ కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఉద్యమం చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి తామంతా వెన్నంటి ఉంటామన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా ముద్రగడ పోరాడుతున్నారని ఆయన అన్నారు. కాగా ఇవాళ దాసరి నివాసంలో ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర కాపు ప్రముఖులు సమావేశమైన విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kapu leaders  Mudragada  chiru  dasari house  

Other Articles