assistant professof held in dowry harrassement case

Asiistnat professor love affair with student caught on facebook

professor love affair with student, TN assistant professor held, asst professor caught on facebook, professor booked for illegal affair, professor booked dowry harrasment, pennagaram women's police station assistant professor balachandran, anu, indur, pennagaram, nekkundi, dharmapuri, student

Tamil Nadu assitant proffessor balachandran caught on facebook for illegal having love affair with student and in harrassing wife for additional dowry

విద్యార్థినికి ప్రోఫెసర్ ప్రేమక్లాసులు.. ఫేస్ బుక్ చేసింది బట్టబయలు..

Posted: 08/29/2016 03:22 PM IST
Asiistnat professor love affair with student caught on facebook

కళాళాలలో విద్యార్థినులకు తరగతి పాఠాలు చెప్పడానికి బదులు ఒకేసారి ఇద్దరు విద్యార్థినులకు వేర్వేరుగా ప్రేమ పాఠాలు నేర్పించడంలో ఘనపాటి ఈ అసిస్టెంటు ప్రోఫెసర్. అయితే ఒకరికి తెలియకుండా మరోకరిని వివాహం కూడా చేసుకుని సంపారాన్ని సాగిస్తున్నాడు.  రెండు కాపురానలు నడపి అలసిపోయాడనుకుంటా.. ఒక విద్యార్థినిని (మొదటి భార్య)ను అదనపు కట్నం తీసుకురావాలని, కానుకులు తెమ్మని హింసింది. అమెను పుట్టింటి పంపాడు. మూడు నెలలుగా అమెను పట్టించుకున్న పాపాన పోలేదు.

అయితే తన భర్త కట్నం కోసమే తనను హింసిస్తున్నడాు తప్ప.. మిగతా అన్ని విషయాల్లో మా ఆయన బంగారం అనుకున్న అమెకు ఫేస్ బుక్ షాక్ ఇచ్చింది. అనుకోకుండా తన భర్త ఫేస్ బుక్ తెరవగానే అయన మరో విద్యార్థినితో చనువుగా వున్న ఫోటోలు కనిపించాయి. అరా తీయగా తన భర్త మరో విద్యార్థినిని రెండో వివాహం చేసుకున్నాడని తెలిసింది. అంతే ఉన్నఫళంగా అమె పెన్నాగరం మహిళా పోలిస్ స్టేషన్ కు వెళ్లి పిర్యాదు చేయగా అతన్ని అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. ధర్మపురి జిల్లా ఇండూరు సమీపంలోగల నెక్కుంది గ్రామానికి చెందిన బాలచంద్రన్ (31). ఎమ్మెస్సీ ఎంఫిల్ చదివిన ఈయన ప్రస్తుతం అరియలూరు జిల్లాలోగల ఒక ప్రైవేటు కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ధర్మపురిలోగల కళాశాలలో ఇతను పనిచేస్తుండగా కళాశాల విద్యార్థిని అనుతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పరిణయానికి దారితీసింది. బాలచంద్రన్ తల్లిదండ్రుల సమ్మతితో మూడేళ్ల క్రితం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. తర్వాత పుట్టింటి నుంచి నగలు, నగదు తెమ్మని ఆమెను చిత్రహింసలకు గురిచేసి పుట్టింటికి పంపాడు.

అదనపు కట్నం కోసం తన భర్త తనను హింసిస్తున్నాడని అను పెన్నాగరం మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో బాలచంద్రన్ ఇల్లు విడిచి పరారయ్యాడు. గత మూడు నెలలుగా అతను ఇంటికి రావడం లేదు. ఇలావుండగా అను అనుకోకుండా భర్త బాలచంద్రన్ ఫేస్‌బుక్ చూసింది. అందులో వేరొక అమ్మాయితో అతను చనువుగా ఉన్నట్లు తెలిసి అరా తీయగా బాలచంద్రన్ మరో వివాహం చేసుకున్నాడని కూడా తెలిసింది. దీంతో ఆమె పెన్నాగరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు బాలచంద్రన్ మరొక యువతిని వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అతన్ని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles