ప్రజా ప్రతినిధుల్లో అధికారంలో లేని వారి కంటే అధికారం ఉన్న వారు, ముఖ్యంగా కీలక పదవుల్లోని వారికి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. మరీ ముఖ్యంగా కేంద్రంలోని బీజేపీ నేతల తీరు చూస్తుంటే ఓ సామెత గుర్తోస్తోంది. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా.. నలుపు నలుపే కాని తెలుపు రాదు అన్న చందాన తయారు అవుతున్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని స్వయానా ప్రధాని మోదీ చెప్పినా సరే అస్సలు వినటం లేదు.
తాజాగా బీజేపీ ఎంపీ ఉదిత్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. పరుగుల రారాజు ఉస్సేన్ బోల్ట్, చిన్నప్పటి నుంచి గొడ్డుమాంసం తినటం మూలంగానే అన్ని పతకాలు విజయాలు సాధించగలిగాడని ఆయన చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. అతని శిక్షకుడు సైతం రెండుపూటలా బీఫ్ తినమని సలహాలు ఇచ్చేవాడని, ఆ అలవాటే అతను 9 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించేందుకు కారణమని ఉదిత్ రాజ్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఈ జమైకా లెజెండ్ విజయాల వెనకున్న అసలు సీక్రెట్ ఇదేనంటూ తెలిపాడు.
Usain bolt of Jamaica was poor and trainer advised him to eat beef both the times and he scored 9 gold medals in Olympic
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 28, 2016
ఇక గొడ్డుమాంసం తింటేనే పతకాలు వస్తాయన్న కోణంలో 55 ఏళ్ల ఉదిత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది. దీనిపై వివరణ అంటూ ఆయన మరో ట్వీట్ వేశాడు. జమైకా బాగా వెనుకబడిన దేశం. పేదరికంతోనే అతను బీఫ్ తిని విజయాలు సాధించాడు. నేను చెప్పేది ఏంటంటే... పేదరికాన్ని కూడా లెక్క చేయకుండా అతను సాధించిన విజయాలనే స్పూర్తిగా తీసుకోవాలని చెప్పాను. నా వ్యాఖ్యలను వక్రీకరించకండి అంటూ మరో ట్వీట్ వేశాడు.
I cited circumstances ofJamaica that despite poor infrastructure & poverty Bolt won 9 gold so our players should find ways like that to win
— Dr. Udit Raj, MP (@Dr_Uditraj) August 29, 2016
బాధ్యతగల నేత, పైగా దళితుడు అయి ఉండి కూడా ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తుండడంతో ప్రజాస్వామ్య దేశం అపహాస్యం పాలవటానికి కారణమవుతున్నాయిని, ముఖ్యంగా మత సంబంధమైన అంశాల్లో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండటం సిగ్గు చేటని పలువురు అభిప్రాయపడుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more