దాసరి, చిరులతో ముద్రగడ భేటీ | Mudragada Padmanabham meets Dasari and Chiru

Mudragada padmanabham meets dasari and chiru

Mudragada issues fresh ultimatum, Mudragada ultimatum to CM Chandrababu, Mudragada meet Dasari and Chiru, Mudragada in Hyderabad, Kapu leader Mudragada, Mudragada Dasari, Mudragada Chiru, Mudragada about Dasari and Chiru, Mudragada Deeksha

Mudragada issues fresh ultimatum to CM Naidu over reservation for Kapus. Mudragada meet Dasari and Chiru in Hyderabad, want want to start Deeksha again.

భాగ్యనగరంలో కాపు వేడిని రాజేస్తున్నాడు

Posted: 08/29/2016 11:44 AM IST
Mudragada padmanabham meets dasari and chiru

కాపు ఉద్యమాన్ని మళ్లీ లెవనెత్తేందుకు కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పావులు కదుపుతున్నారు. గత రాత్రి హైదరాబాదు చేరుకున్న ఆయన ఈరోజు పలువురు కాపు నేతలతో భేటీ కానున్నారు. సోమవారం ఉదయం ముందుగా దర్శకుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావుతో భేటీ అయిన ముద్రగడ కాసేపట్లో నటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవితో సమావేశం కానున్నాడు. రెండు రోజులు భాగ్యనగరంలోనే మకాం వేయనున్న ముద్రగడ పలువురు కీలకనేతలతో మంతనాలు చేయటమే కాదు, మళ్లీ ఉద్యమాన్ని తెరపైకి తెచ్చి ఈసారి వారి మద్ధతుతో ముందుకు సాగటంతోపాటు, అవసరమైన మరోసారి ఆమరణ దీక్ష చేసేందుకు తెలుస్తోంది.

ఈ క్రమంలో దాసరి ఇంట్లో రేపు కాపు నేతలంతా సమావేశం అయ్యే అవకాశం ఉందన్న సమాచారం అందుతోంది. అయితే కేవలం ముద్రగడను విందు కోసం మాత్రమే దాసరి ఆహ్వానించినట్లు పైకి వార్తలు వినవస్తున్నాయి. భేటీకి అంబటి రాంబాబు పలువురు నేతలతోపాటు అల్లు అరవింద్ వంటి సినీ ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం కూడా అందినట్లు తెలుస్తోంది. ఇక నిన్న హైదరాబాద్ కి బయలుదేరే ముందు ముద్రగడ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలే చేశారు.

కాపులకు రిజర్వేషన్లపై చంద్రబాబు సర్కారు నాన్చుడు ధోరణి అవలంబిస్తోందని ఆరోపిస్తున్న ముద్రగడ... మరోమారు ఉద్యమ బాట పట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నానని ముందస్తు సంకేతాలు అందజేశారు కూడా. ఈ నెలాఖరు లోగా కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని తేల్చాలని డెడ్ లైన్ విధించిన ముద్రగడ... అలా జరగని పక్షంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు కూడా. పేద కాపులకు న్యాయం జరగాలన్నదే తమ ధ్యేయమని, ఇందుకోసం వచ్చేనెల 11న అన్ని జిల్లాల కాపు నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు ముద్రగడ ప్రకటించాడు.

ఇక పవన్ కళ్యాణ్ ను కలుపుకుని ముందుకు వెళ్తారా అని మీడియా ప్రశ్నించగా, ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నాడని, తాను కులం కోసం పోరాటం చేస్తున్నానని, రెండింటికి పొంతన లేదు కదా సమాధానమిచ్చారు. కాగా, గతంలో ఆయన పవన్ తిరుపతి సభపై స్పందిస్తూ.. 'పవన్ కల్యాణ్ తో పోలిస్తే తాను అల్పుడినని, అతని స్థాయికి తగనని, అసలు తిరుపతి సభ గురించి మాట్లాడే స్థాయి తనకు లేదని' వ్యాఖ్యానించడం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada Padmanabham  Dasari  Chiru  Kapu leaders  Hyderabad  Ultimatum  Chandrababu  

Other Articles