లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ లో కాల్పులు కాదు | No firing at Los Angeles airport Its just loud noise only

No firing at los angeles airport its just loud noise only

No firing at Los Angeles airport, Los Angeles airport fire, No firing only loudness, Los Angeles airport news

No firing at Los Angeles airport Its just loud noise only.

ITEMVIDEOS:లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ లో కాల్పులు కాదు

Posted: 08/29/2016 10:52 AM IST
No firing at los angeles airport its just loud noise only

అమెరికాలో ఆదివారం అర్థరాత్రి దాటాక కాల్పుల వార్తతో కలకలం రేగింది. లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ లో ఓ ఆగంతకుడు తుపాకీ చేతబూని హల్ చల్ సృష్టించాడని, అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించాడని వార్తలు అందాయి. అయితే అది కాల్పులు కాదని, కేవలం పెద్ద శబ్దాలతోనే ప్రయాణికులు పరుగులు తీశారని అధికారులు తెలిపారు. తొలుత అవి కాల్పుల శబ్ధమే అని పొరపాటు పడిన భద్రతా దళాలు కూడా అప్రమత్తమయి, ఎయిర్ పోర్టును మూసివేసి ప్రయాణికులను బయటకు పంపించి వేసింది.

విమానాలను ఎక్కడికక్కడ నిలిపేసి అణువణువునా గాలిస్తున్నాయి. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. భయంతో కొంతమంది ప్రయాణీకులు అటు ఇటు పరుగులు పెడుతుండగా, మరికొందరు ప్రయాణీకులు సమీపంలోని రెస్టారెంట్లలలో తలదాచుకున్నారు.

 

ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్ట్ మొత్తం స్వాట్ టీమ్స్ తోపాటు కీలక సాయుధ బలగాలతో నిండిపోయింది. ఇంతలో ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణికులు, పోలీసులు బయటికి పరిగెడుతూ వస్తున్న వీడియోలను కొందరు నెట్లో అప్ లోడ్ చేయటంతో అక్కడంతా భయానక వాతావరణం కనిపించడంతో కాల్పులు నిజమేనన్న వార్తలను ధృవీకరించుకున్నారు. అయితే పెద్ద శబ్దాలు రావటంతోనే ఇలా జరిగిందని, ప్రస్తుతం పరిస్థితి తమ అదుపులోనే ఉందని, ఇలాంటి ఫోటోలు, వీడియోలతో అనవసరమైన పుకార్లు లేపొద్దని భద్రతా సిబ్బంది నెటిజన్లను కోరుతున్నారు. ప్రస్తుతం ఆ సౌండ్లు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : No  fire  Los Angeles airport  

Other Articles