Italian Wingsuit Pilot Livestreamed His Own Fatal Collision On Facey

Italian wingsuit pilot streams his own horror death live on facebook

Italian wingsuit pilot, Armin Schmieder, livestream, Alpschelehubel mountain, Swiss Alps, Kandersteg, Berne. Facebook,GoPro camera,

An Italian wingsuit pilot attempting to livestream his latest flight on Facebook unwittingly broadcast his death after something apparently went wrong in the descent.

అనందాన్ని పంచుదామని.. అనంతలోకాలకు పైలెట్

Posted: 08/29/2016 11:28 AM IST
Italian wingsuit pilot streams his own horror death live on facebook

ప్రాణం విలువ నేటి యువతరానికి బొత్తిగా తెలియదు. ప్రాణం అంటే తృణప్రాయంలో భావించి లేనిపోని సాహసాలకు పాల్పడుతూ ప్రాణాలను విడుస్తున్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో చేయాల్సిన సాహసాలను.. ఉల్లాస, ఉత్సహాల కోసం.. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హీరోలుగా మారడం కోసం చేస్తూ.. కన్నవారికి శోకాన్ని మిగుల్చితున్నారు. తమకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవాన్ని సమాజం కోసం వినియోగించడం మానేసి.. ఏదో ఒకటి చేసిన సెన్సెషన్ చేయాలని భావిస్తున్నారు.

ఇలాంటి వాటికి ఈ ఇటాలియన్ పైలెట్ డేరింగ్ వింగ్ సూట్ జంప్.. ఇక ఉదాహరణ. తన అనందాన్ని అందరితో షేర్ చేసుకోవాలనుకున్న అతడు.. అనంతలోకాలకు చేరుకున్నాడు.  వివరాల్లోకి వెళ్తే ఆకాశంలో తన వింగ్ సూట్ జంప్ను ఇతరులతో పంచుకోవాలనుకున్న జోష్తో ఓ ఇటాలియన్ పైలట్ తన డేరింగ్ జంప్ను సోషల్ మీడియాలో ప్రసారం చేస్తుండగానే ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. 28 ఏళ్ల ఆర్మిన్ చెమీడర్.. స్విట్జర్లాండ్లోని కాండెర్స్టెగ్ సమీపంలోని ఓ పర్వతం పైనుంచి దూకే ముందు 'నేడు మీరు నాతో జంప్ చేయొచ్చు' అని పేర్కొంటూ ఉరిమే ఉత్సాహంతో జంప్ చేసి అనుకోకుండా మృత్యువాత పడ్డాడు.

ఆన్లైన్లో ఈ వీడియాను వీక్షిస్తున్న ప్రేక్షకులు అతడు పడిపోతున్న శబ్దాలు విని స్థాణువులయ్యారు. ఆ హర్రర్ వీడియోకు స్పందించి వెంటనే అతడికి ఫేస్బుక్లో సందేశాలు పంపించినప్పటికీ అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో అతడి చనిపోయాడనే విషయం స్పష్టమైంది. మృతదేహం కోసం గాలించగా..  కాండెర్స్టెగ్ సమీపంలో పాపులర్ బేస్ జంపింగ్ లోకేషన్లో లభ్యమైనట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదానికి గల కారణంపై విచారణ చేస్తున్నామని వివరించారు. ఆన్లైన్లో పోస్టుచేసిన వీడియోను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Italian wingsuit pilot  death  death live on Facebook  

Other Articles