Rahul Gandhi must quit politics to save future of Congress says subramanian swamy

Subramanian swamy gives free advice to opposition leader

subramanian swamy, subramanian swamy rahul gandhi, rahul gandhi, rahul gandhi swamy, rahul gandhi rss, rahul gandhi rss remarks, rahul gandhi rss news, india news, swamy rahul gandhi, subramanian swamy twitter, swamy twitter

BJP leader Subramanian Swamy advised Congress vice president Rahul Gandhi to quit politics to save the grand old party’s future.

యువనేతకు సుబ్రహ్మణ్యస్వామి ‘ఉచిత’ సలహా

Posted: 08/26/2016 07:27 PM IST
Subramanian swamy gives free advice to opposition leader

భారతీయ జనతా పార్టీ సినీయర్ నేత.. వివాదాలకు, విమర్శలకు, అరోపణలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సుబ్రహ్మణ్యస్వామికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంటే అసలు గిట్టడం లేదు. అనాటి స్వతంత్ర సమరయోధులు స్వరాజ్యాన్నిసాధించిన తరువాత పాలన కోనసాగిస్తున్న క్రమంలో ఏదైనా తప్పు చేసి దానిని సరిదిద్దుకుంటే అప్పటి ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా దానిని సమర్థించేవి. సదరు నాయకుడిని ప్రశంసలతో కూడా ముంచెత్తేవి. ప్రస్తుతం కేంద్రంలో వున్న బీజేపి నేతృత్వంలోని అధికార ఎన్డీఏ పార్టీ స్వతంత్ర సమరయోధులను వారి సేవలను అనునిత్యం కీర్తించే పార్టీ వారి బాటలో పయనించిన ప్రస్తుత నాయకుడిపై మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి,

మరీ ముఖ్యంగా సుబ్రహ్మణ స్వామి వైఖరి మాత్రం సరిగ్గా అలానే వుంది. అవకాశం దోరక్కపోయినా నేనున్నానంటూ తన ఉనికిని చాటుకునేందుకు సంచలన వ్యాఖ్యలు చేసే నేతగా మారిన సుబ్రహ్మణ్య స్వామి  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, యువనేత రాహుల్ గాంధీకి తనదైన శైలిలో ఓ ఉచిత సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకోసం రాహుల్ రాజకీయాలనుంచి వైదొలగాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వేషపూరిత మరియు విభజించే అజెండాపై తన పోరాటం కొనసాగుతుందని రాహుల్  ట్విట్ మరుసటి రోజే స్వామి ఇలా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసలు ఆ ట్విట్ కూడా రాహుల్ చేసిన ఉండరని  కార్యాలయంలో  మరెవరో చేసి వుంటారనే అనుమానం కూడా వ్యక్తం చేశారు.

జాతీయ ప్రాముఖ్యత కీలక అంశాలపై `యు-టర్న్' తీసుకోవడం రాహుల్ గాంధీకి అలవాటుగా మారిందని స్వామి ఘాటుగా విమర్శించారు. ఆయనకు రాజకీయ భవిష్యత్తు లేదని..  అతిపురాతన కాంగ్రెస్  పార్టీ ప్రతిష్టను  కాపాడాలంటేనే రాజకీయాల నుంచి నిష్క్రమించాల్సిందేనన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ హత్యకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కారణమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సుప్రీం కోర్టులో పరువునష్టం దావా వేసింది. రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను అవమానించలేదని కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో చెప్పాడంతో సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subramanian swamy  rahul gandhi  free advise  quit politics  congress  BJP  

Other Articles