తెలంగాణ కొత్త జిల్లాల మ్యాపు | telangana government released 27 districts map officially

Telangana government released 27 districts map officially

telangana government, 27 districts map officially, telangana new districts map, telangana official map, new districts map of telangana, telangana new districts

Telangana government released 27 districts map officially.

తెలంగాణ కొత్త జిల్లాల మ్యాప్ బయటపెట్టారు

Posted: 08/26/2016 05:52 PM IST
Telangana government released 27 districts map officially

త్వరలో కొత్తగా ఏర్పడబోయే 17 కొత్త జిల్లాలకు సంబంధించిన మ్యాపులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా వెబ్ సైట్లో ఉంచింది . ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ను జారీ చేసిన కేసీఆర్ సర్కారు... అందులో 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో సమగ్ర సమచారం పొందుపరిచింది. ఇక ఈరోజు తన అదికారిక వెబ్ సైట్ లో కొత్త జిల్లాల మ్యాపులను విడుదల చేసింది. ఈ మ్యాపుల్లో కొత్త జిల్లాలతో పాటు... జిల్లాల విభజన జరిగిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర స్వరూపానికి సంబంధించిన మ్యాపులు కూడా ఉన్నాయి.

జిల్లాల సరిహద్దులతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న రెవెన్యూ డివిజన్లు, మండలాల నైసర్గిక స్వరూపానికి చెందిన మ్యాపులు కూడా ఉన్నాయి. వెరసి కొత్తగా ఏర్పాటు కానున్న 17 జిల్లాలు సహా మొత్తం 27 జిల్లాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఆ మ్యాపుల్లో కనిపిస్తోంది.

కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలు ఉన్నాయి. ఇప్పటిదాకా 5వేల అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. గడువు ముగిశాక వాటిపై సమీక్ష జరిపనున్న కేసీఆర్, దసరా రోజ నుంచి వీటిని అధికారికంగా అమలులోకి తేనున్నారు. కొత్త జిల్లాల పూర్తి వివరాలు http://newdistrictsformation.telangana.gov.in ను క్లిక్ చేసి చూడవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  new districts  map  official  

Other Articles