ఇటలీలో భారీ భూకంపం | Strong earthquakes hit Central Italy

Strong earthquakes hit central italy

Strong earthquakes hit Central Ital, Italy earthquake, Earthquake in Italy, Italy earth quake Richter scale 6.2, 6.2 earthquake in Italy

Strong earthquakes hit Central Italy.

ఇటలీలో భారీ భూకంపం... కుప్పకూలిన భవనాలు

Posted: 08/24/2016 09:54 AM IST
Strong earthquakes hit central italy

భారీ భూకంపం దాటికి ఇటలీ కకావికలం అయ్యింది. బుదవారం ఉదయం పెను భూకంపంతో ఇటలీ చిగురుటాకులా వణికిపోయింది. అందుతున్న సమాచారం ప్రకారం రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.2 తీవ్రతగా ఉంది. కేవలం 20 సెకన్ల పాటే ప్రకంపనలు వచ్చినప్పటికీ, పెను విలయం దాటికి దేశంలోని పెద్ద భవనాలు కుప్పకూలినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నోర్సియా ప్రాంతంలో ఆ తీవ్రత మరి ఎక్కువగా ఉందట.

ఈ భవనాల శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు ఇద్దరు చనిపోగా, మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదు. భూకంపం జరిగిన వెంటనే అప్రమత్తమైన ఇటలీ ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది. మరోసారి భూకంపం వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Italy  Earth Quake  6.2  

Other Articles