Maggi — India's 2-minute instant noodle retains top spot in market

Maggi regains top spot in noodles market with 57 share in june

Maggi, market share, Nestle, noodles market, FSSAI, Bombay high court, Nestle Maggi, Nestle India Ltd, MSG in maggi, Maggi, Maggi noodles, Maggi lead, MSg, Maggi shares, Nestle India

Maggi sales were severally hit by the Food Safety and Standards Authority of India (FSSAI) ban last year, has regained its leadership position capturing 57% share of the market in June this year.

విమర్శలు పెల్లుబిక్కిన చోటే సేల్స్ అదుర్స్..

Posted: 08/23/2016 03:43 PM IST
Maggi regains top spot in noodles market with 57 share in june

మోనో సోడియం గ్లుటామేట్ వుందని, ధీని ప్రభావంతో అరోగ్యవంతులు కూడా అనారోగ్యం బారిన పడతారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) నిషేధం విధించడంతో ఆ తరువాత కూడా పలు మ్యాగీ శాంపిల్స్ లో ఎంఎస్జీ ఉందని తేలడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కోన్న మ్యాగీ.. మళ్లీ భారతీయ విఫనిలో నెంబర్ వన్ గా నిలిచింది. నిషేధంతో మ్యాగీ పని అయిపోయిందని, ఇక దాని బదులుగా గోదుమ నుడ్యూల్స్ వచ్చినా.. మార్కెట్ ను ఈ లోపు కబ్జా చేయాలని ఎన్నో కంపెనీలు పోటీపడినా.. వాటి అంచనాలను మ్యాగీ తలకిందులు చేసింది.

ఈ ఏడాది ప్రథమార్థం వరకు 57 శాతం మార్కెట్ షేరును సొంతం చేసుకుని మార్కెట్లో తన ఆధిపత్య స్థానాన్ని మ్యాగీ పునరుద్ధరించుకుంది. రీఎంట్రీ ఇచ్చిన తొమ్మిది నెలల కాలంలోనే 57.1 శాతం మార్కెట్ షేరును మ్యాగీ కైవసం చేసుకోవడంపై నెస్లే ఇండియా ఆనందం వ్యక్తం చేస్తోంది. ఇన్ స్టెంట్ నూడుల్స్ సెగ్మెంట్లో ఆరోగ్యవంతమైందిగా మ్యాగీ నిలుస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. మ్యాగీ నూడుల్స్లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణలతో పలు రాష్ట్రాలు ఈ ఉత్పత్తులపై నిషేధం విధించాయి. ఇవి క్యాన్సర్ ముప్పుకు దారితీస్తున్నాయని ఆరోపణలు వచ్చాయి

ఐదు నెలల నిషేధం కాలంలో నెస్లే ఇండియా రూ.500 కోట్లకు పైగా విక్రయాలను కోల్పోవాల్సి వచ్చింది. ల్యాబ్ పరీక్షల్లో మ్యాగీ నూడుల్స్ నాణ్యమైనవేనని తేలడంతో మళ్లీ ఉత్పత్తులను నవంబర్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నిషేధం అనంతరం మొదటిసారి గత డిసెంబర్లో మ్యాగీకి డిమాండ్ పుంజుకుంది. మార్కెట్లోకి పునఃప్రవేశించిన ఒక నెలలోనే 35.2 శాతం మార్కెట్ షేరు పెంచుకుంది.  2016 మార్చిలోనే ఈ ఇన్ స్టెంట్ నూడుల్స్ 51 శాతం మార్కెట్ షేరును దక్కించుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nestle India Ltd  Maggi  2-minute instant noodle  top spot  Indian market  

Other Articles