అప్పు తీర్చలేదని స్నేహితుడు తల నరికి చంపాడు | Man beheads friend walks into police station with head in sack

Due to financial dispute man beheads friend walks into police station

man beheaded his friend, bangalore man beheaded, man beheaded and surrender in Police Station, financial dispute man beheaded his friend

A man beheaded his friend over a financial dispute and walked into the Vishwanathapura police station near Devanahalli with the severed head on Sunday night.

క్లోజ్ ఫ్రెండ్ తలతో పోలీస్ స్టేషన్ కు...

Posted: 08/23/2016 10:06 AM IST
Due to financial dispute man beheads friend walks into police station

మద్యం మత్తు నశాలానికి అంటిదంటే చాలూ మనిషిని ఎంతటి దారుణాలకైనా ఉసిగొల్పేలా చేస్తుంది. తాజాగా బెంగళూర్ లో ఇలాంటి ఘటనే ఒకటి బయటపడింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న ఇద్దరి మధ్య డబ్బు గొడవ కాస్త చిలికి ప్రాణ స్నేహితుడినే హత్యకు దారి చేసేలా ఉసిగొల్పింది.

ఆదివారం రాత్రి దుస్తుల నిండా రక్తపు మరకలు, చేతిలో మనిషి తలతో భయానకంగా ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు. అతన్ని చూసిన ఖాకీలు కూడా కాసేపు బెంబేలెత్తిపోయారంట. తీరా అసలు విషయం తెలుసుకుని పోలీసులు నివ్వెర పోయారంట.

వివరాళ్లోకి వెళ్లితే... యెలహంక శివారులోని ఉగనవాడికి చెందిన మంజునాథ, శశికుమార్ లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. కొంతకాలం క్రితం తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం శశికుమార్ వద్ద మంజునాథ రూ.25 వేలు అప్పుగా తీసుకున్నాడంట. అయితే ఈ అప్పును అతడు సకాలంలో చెల్లించలేకపోయాడు. అయినా క్లోజ్ ఫ్రెండ్ కావటంతో శశి ఆ డబ్బు గురించి ప్రస్తావించలేదు.

ఇక ఆదివారం రాత్రి ఈ ఇద్దరు మిత్రులు సరదగా మద్యం సేవించారు. ఈ క్రమంలో డబ్బును ఏం చేశావని శశి ప్రశ్నస్తే, మంజునాథ్ నిర్లక్ష్య సమాధానం ఇచ్చాడు. దీంతో కాలిన శశి తీసుకున్న అప్పును తీర్చాలంటూ మంజునాథతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో మంజునాథ్ చేయి చేసుకోవటంతో, ఆవేశానికి గురైన శశికుమార్ కత్తి తీసుకుని దాడి చేశారు. మంజునాథ తలను అతడి శరీరం నుంచి వేరు చేసి చంపేశాడు. ఆ తర్వాత మంజునాథ తలను ఓ సంచిలో వేసుకుని విశ్వనాథపుర పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి, అనంతరం చేతిలో తలతో లోపలికి వెళ్లి లొంగిపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore  Friend  beheaded  police station  

Other Articles