chandrababu to fecilitate PV Sindhu in vijayawada

Pv sindhu to accord grand welcome to vijayawada

pv sindhu, sindhu hyderabad, ap government, chandrababu, krishna pusharalu, PV sindhu, vijayawada, silver medal winner, closing ceremony, sindhu celebrations, sindhu silver medal, sindhu olympics, sindhu vijayawada, india rio olympics, india olympics, olympics news, sports, sports news

Andhra Pradesh Government to felicitate Rio ollympics silver medal winner PV Sindhu who returned froem brazil to india yesterday.

ITEMVIDEOS:బెజవాడలో పీవీ సింధూకు ఏపీ ప్రభుత్వం ఘన సన్మానం..

Posted: 08/23/2016 09:34 AM IST
Pv sindhu to accord grand welcome to vijayawada

ఓవైపు కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవం... మరోవైపు ఒలింపిక్స్‌లో రజత విజేత సింధుకు సత్కార మహోత్సవం! ఈ రెండు కీలక ఘట్టాలకు ఇవాళ విజయవాడ వేదికక కానుంది. నిన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి స్వాగత సత్కారాలు అందుకున్న రజత పతక విజేతను ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. తెలుగు తేజం సింధును రాష్ట్ర అతిథి హోదాతో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తీసుకొస్తున్నారు.

బెజవాడ నగరంలో సిందూ అమె కోచ్ పుల్లెల గోపించంద్ తో పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అందుబాటులో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు తోడు రాగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించనున్నారు. రెండు చోట్ల సన్మానాలు, బహుమతుల ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో, పవిత్ర సంగమం వద్ద జరిగే కృష్ణా హారతి వేదికపై సింధును సన్మానిస్తారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొంటారు. దీనికి సంబంధించి అధికారులు, మంత్రులకు సీఎం సూచనలు ఇప్పటికే తగిన సూచనలు చేశారు.

సింధును ఎంపీ కేశినేని నాని ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తోడ్కొని వస్తారు. మరికోద్ది సేపట్లో గన్నవరం విమానాశ్రయానికి సింధు చేరుకుంది. క్రీడల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహా పలువురు మంత్రులు, అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, క్రీడాభిమానులు సింధుకు గన్నవరం విమానాశ్రయంలో అమెకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. రెండు కిలోమీటర్ల పోడువైన జాతీయ పతాకంతో అమెకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు భారీగా చిన్నారులు వేచిచూస్తున్నారు. అక్కడి నుంచి బెజవాడ స్టేడియానికి వెళ్లి అక్కడ సింధూతో పాటు అమె కోచ్ గోపిచంద్ ను సన్మానించారు.  అ తరువాత దుర్గమ్మ ఘాట్ వద్ద సింధూ కృష్ణా పుష్కరస్నానం అచరించనుంది. సాయంత్రం కృష్ణా పుష్కరాల ముగింపు ఉత్సవాలలో భాగంగా హరతి కార్యక్రమాలలో కూడా సింధూ పాల్గోననున్నారు. అక్కడ కూడా అమెను ప్రభుత్వం మరోమారు సన్మానించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles