gopi chand who doesn't gives pride to his coach, is eligible for the same now.?

Is pullela gopichand eligible to be proud of sindhu coach

Olympics 2016, India, Badminton, Rio 2016 Badminton, PV Sindhu, Badminton, Carolina Marin, Pullela Gopichand, chetan anand, SM Arif, Sudhir Babu, B.Kiran Kumar, Palanki Uday Bhaskar Babu, chetan anand, latest Olympics 2016 news, olympics news

Pullela Gopichand all england badminton champion and coach of pv sindhu gets immence credit of rio silver medal, is he really eligible for it.

సింధు కోచ్ గోపిచంద్ కు గౌరవమర్యాదలు అవసరమా..?

Posted: 08/20/2016 05:41 PM IST
Is pullela gopichand eligible to be proud of sindhu coach

రియో ఒలంపిక్స్ లో పివీ సింధూ రజత పతకాన్ని అందుకున్న నేపథ్యంలో యావత్ దేశం అమను పొడగ్తలతో ముంచెత్తతుంది. అమె సాధించిన ఈ ఘనకీర్తితో యావత్ భారతావని అమెను ప్రశంసల వర్షంతో ముంచెత్తుతుంది. అయితే అమెతో పాటు అమెకు శిక్షణ ఇచ్చిన గురువు పుల్లెల గోపిచంద్ ను కూడా దేశం కీర్తిస్తుంది. ఒలంపిక్స్ తో సత్తాచాటిన సిందు.. రికార్డును నమోదు చేయడానికి కూడా కారణం గోపిచంద్ అన్నడంతో తప్పేం లేదు. కాకపోతే ఇదే గోపిచంద్ తాను 2001లో ఆల్ ఇంగ్లండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచినప్పుడు.. ఇప్పుడాయన పోందుతున్న గౌరవాన్ని అప్పటి తన కోచ్ కు ఎందుకు లభించలేదన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఎందెందు వెతికినా ఎమున్నది గర్వకారణం అన్నట్లు భారత్ దేశంలో ఏ రంగాన్ని తీసుకున్న అందందే కలదు కుల, మత, ప్రాంత రాజకీయమని చెప్పక్కర్లేదు. అసంబంధం అనుకున్న.. ఇదే నిజం. గురువుంటే నేర్పించేవాడు. పాఠశాలలో విద్యార్థుల భవిష్యత్ కోసం కష్టపడి పాఠాలు చెప్పిన మాస్టార్లను ఎంత మంది విద్యార్థులు గుర్తుపెట్టుకుంటారు. అంటే పాఠాలు చెప్పిన వాడే గురువు కాదు. తాము ఎంచుకున్న రంగంలో తమ ఉన్నతిని కాంక్షించే వాడే గురువు.



ఇప్పుడంటే విద్యాభోదనకు ప్రాథాన్యత పెరిగింది కానీ, మన పురాణాలను తీసుకుంటే.. వేద పఠనం, సంస్కృతం నుంచి అస్త్ర, శస్త్ర విద్యాలన్నింటినీ నేర్పేవాడు గురువు. ఈ రోజుకూ మనం ద్రోణాచార్యుడి గురించి ప్రస్తావిస్తున్నామంటే అది అర్జునుడి విలువిద్య, భీమ, దుర్యోధనుల గద విద్య, ఏకలవ్యుడి గురుభక్తి తెలియడం వల్లేకదా. అలా తమను ఉన్నత స్థానంలో నిలబెట్టి.. సమాజంలో సముచిత స్థానం కల్పించి.. హోదాకు కంకణబద్దులైన గురువులను మరిస్తే వారిని కృతఘ్ఞడని కాక మరేంమంటాం.

అలాంటి తప్పిదాన్ని ఏమాత్రం చేయకుండా తన గురువుకు దక్కాల్సిన గౌరవాన్ని ఆయనకు దక్కేలా చేసింది సింధూ. దీంతో పలు పత్రికలలో అంతా గోపిచంద్ మహత్యమే అంటూ కితాబిస్తూ పచ్చ పత్రికలు కామెర్లు సోకినట్లుగా వార్త కథనాలను ప్రచురించాయి. పీవి సింధు బాడ్మింటన్ కోచ్ గోపీచంద్ గురించి ఆకాశాని కెత్తేశాయి. ఈ అరుదైన ఫీటును సాధించేందుకు అమె పడిన 12 ఏళ్ల కఠోర శ్రమను వెనుక అమె పడిన ఇబ్బందులను అసలు మచ్చకనా  ప్రస్తావించకుండానే అమె కల నెరవేరిందని, అందుకు కారణం గోపిచందేనని శ్లాఘించాయి. ఇంతవరకు బాగానే వుంది. కొంత ఇబ్బందికరమైనా సింధులో పోరాట పటిమ లేకుంటే గోపిచంద్ లాంటి గురువులు ఎంత చేసినా పలితం వచ్చేది కాదు.

గోపిచంద్ అకాడమీ నుంచి బెంగళూరు అకాడమీకి వెళ్లిన సైనా నెహ్వాల్ కారణం వెళ్లడిస్తే తప్ప మనకు విషయాలు అర్థంకావు. అయితే అమె తప్పిదారి ఒక మాట నోరుజారింది. హైదరాబాద్ లోని గోపిచంద్ అకాడమీలో వుండివుంటే తాను సాధించాల్సిన విజయాలు మాత్రం నమోదయ్యేవి కాదని పేర్కోంది. ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేసిందన్న విషయం అమె స్వియ చరిత్ర బయటకువస్తాకానీ తెలియదు. అది ఎప్పుడ వస్తుందో కూడా తెలియదు. అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అయితే ఇక్కడ నిజాయితీగా తన విజయాన్ని గురువు కారణమని చెప్పుకున్న పివీ సింధూ వినమ్రతను మాత్రం మెచ్చుకోక తప్పదు.

ఒక అంతర్జాతీయ టైటిల్ గెలువగానే గురువును పట్టించుకోకుండా.. అసలు గురువనేవాడెవరూ అన్నట్టుగా వ్యవహరించే కొందరు క్రీడాకారలు, మాజీ క్రీడాకారులకిది చెంపపెట్టు. అయితే పీవి సింధు కోచ్ గా గోపిచంద్ అందుకుంటున్న ప్రశంసలకు ఆయన అర్హుడా..? కాదా..? అన్నది కూడా ముఖ్యమైన అంశం. ఎందకంటే కోచ్ గా గోపిచంద్ పేరు యావత్ దేశంలో మార్మ్రోగుతున్న తరుణంలో.. 2001లో గోపిచంద్ స్వయంగా ఆల్ ఇంగ్లండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచినప్పుడు ఆయన కోచ్ కూడా ఇలానే గౌరవాన్ని పోందాడా..? అన్నదే అసలు ప్రశ్న.

నిజమైన కళాకారుడికి చప్పట్లు ఎంతగా తృప్తినిస్తాయో.. గురువు స్థానంలో వున్నవారికి శిష్యులందించే ప్రేమాభిమానాలు, సమాజం అందించే గౌరవమర్యాదలే పెద్ద బహుమతి. అయితే ఆ గౌరవ మర్యాదల గుర్తింపు దక్కని గురువుల జాబితాలో నిలిచిన వ్యక్తి పాలంకి ఉదయ్ భాస్కర్ బాబు. అయన శిష్యుడు అల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంఫియన్ షిఫ్ గెలిచినా.. ఆ గౌరవం మాత్రం అయనకు దక్కలేదు. తన శిష్యులు మరింత ప్రతిభతో ముందుకురావాలని తపనపడుతూనే వారికి శిక్షకులుగా వ్వవహరించారు. తమ పని తాము చేశామని ఆత్మసంతృప్తి పోందారు. అయితే ఆ శిష్యుడెవరు అంటే నేటి సింధు కోచ్ పుల్లెల గోపిచందే కావడం గమనార్హం.

ఆల్ ఇంగ్లండ్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచినప్పుడు 2001లో తన కోచ్ పేరును వ్రాయని వ్యక్తి నేడు కోచ్ గా గౌరవ మర్యాదలను, భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ అందించే పారితోషకాన్ని అందుకునేందుకు అర్హుడా అన్న అరోపణలు వినబడుతున్నాయి. గురువింద గింజకు వున్నట్లుగా తన మనస్సులో కపటతత్వాన్ని దాచుకుని గురువునే కాదన్న వ్యక్తికి గురుస్థానంలో గౌరవ మర్యాదలను అందించడం తప్పు కాదా.. అంటూ పలువరు విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం తన ఉన్నతి కోసం అలోచించే వ్యక్తులు.. ఇలాంటి కుయుక్తులతో రాణించాలని భావిస్తారన్న ఘాటు విమర్శలు కూడా వినబడుతున్నాయి. అయితే భాస్కర్ బాబు వద్ద శిక్షణ పోందిన అనేక మందిలో చేతన్ ఆనంద్ లాంటి అంతర్జాతీయ క్రీడాకారులు కూడా వున్నారు. అయితే బ్యాడ్మింటన్ పై భారత్ లో అధరణ పెరిగిన తరువాత రాణించిన శిష్యుడు మాత్రం గోపిచంద్.

బ్యాడ్మింటన్ క్రీడకు గుర్తింపులేని రోజులోనే ఆ క్రీడ పట్ల ఆసక్తి కనబర్చి, ఈ క్రీడలో రాణించాలని ఎందరెందరి విద్యార్థులకో శిక్షణనిచ్చి.. వారికి నైపుణ్యాలను, మెలకువలను నేర్పిన వ్యక్తి ఉదయ్ బాస్కర్ బాబు. అయితే తన కోచ్ పేరును కూడా స్పష్టంగా చెప్పుకోలేని గోపిచంద్.. ఎలాంటి గురువులు లేకుండానే ఆల్ ఇంగ్లాండ్ టైటిల్ సాధించాడా..? అన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. ఇందుకు కారణం కూడా వుంది. అదేంటంటే తాను ఈ క్రీడలో రాణించి.. ఒక టైటిల్ సాధించి.. తన సామాజికవర్గ పెద్దలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెప్పించుకుని అత్యంత విలువైన భూమిని కాజేయాలని అప్పటికే ప్రణాళికలు రచించుకున్నడన్న అరోపణలు వున్నాయి.

తనకు శిక్షకుడిగా వ్యవహరించిన ఉదయ్ భాస్కర్ బాబు పేరును తెరపైకి తీసుకువస్తే.. అతనికే ప్రాధాన్యత పెరుగుతుంది తప్ప తనకు లాభం చేకూరదన్న కుయుక్తులు పన్ని.. గోపిచంద్ ఇలా వ్యవహరించాడన్న అరోపణలు వున్నాయి. అయితే అల్ ఇంగ్లాండ్ ఛాంఫియన్ గా 2001లో అవతరించిన గోపిచంద్ కు అప్పట్లో సమైక్యారాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వున్న చంద్రబాబు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయనకు ఈజీగానే అత్యంత విలువైన భూమి లభించిందన్న విమర్శలూ వున్నాయి. అప్పటికే కోచ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యుడైన ఉదయ్ బాస్కర్ బాబు కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అతన్ని అణచివేయాలన్న కుట్రతో పాటు.. అతడు కీర్తి గడిస్తే.. తన పరిస్థితేంటన్న కుట్రతోనే గోపిచంద్ ఇలా వ్యవహరించారన్న అరోఫణలు వున్నాయి.

భాస్కర్ బాబు తన కోచ్ అన్న పేరును రాయని గోపిచందర్ ఇప్పుడు సిందు కోచ్ గా గౌరవ మర్యాదలు పొందడానికి అర్హుడు కాదన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.తన గురువుకు దక్కాల్సిన గౌరవాన్ని ఎందుకు అడ్డుకున్న వ్యక్తికి కితాబివవ్వడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. భూమి కోసమో, భుక్తి కోసమో, ఢబ్బు కోసమో, దస్కం కోసమో కోచ్ లు తమ శిష్యుల జీవితాలతో అడుకోరని అంటున్నారు ఉదయ్ భాస్కర్ బాబు. తమ శిష్యులను మేలైన రత్నాలుగా తీర్చిదిద్దాలని గురువులు భార్యబిడ్డలకు దూరంగా, ఎంతో కష్టమైనా.. ఇష్టంగా.. కఠోర దీక్షతో, ఏకాగ్రతతో.. వారిలోని నైపుణ్యాన్ని పెంపోందించేందుకు, ప్రత్యర్థిని ఓడించేందుకు టెక్నిక్స్ ల విషయంలో నిరంతరం అప్ డేట్ గా వుంచేందుకు ప్రయత్నించే వారే గురువులని అంటున్నారు భాస్కర్ బాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : PV Sindhu  Badminton  Pullela Gopichand  chetan anand  Palanki Uday Bhaskar Babu  

Other Articles