తప్పతాగి యువతితో అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసు | Drunk Chennai cop molests 18-year-old girl student in public

Drunk chennai cop molests 18 year old girl student in public

Drunk Chennai cop molests, Girl student molest in public, girl molest in Publicly, girl rape in Chennai, Cop rape girl, Drunken Chennai Cop, Cop Rape girl in India

Drunk Chennai cop molests 18-year-old girl student in public, Arrested.

తప్పతాగిన మైకంలో కామంతో యువతిని పబ్లిక్ గా....

Posted: 08/20/2016 03:17 PM IST
Drunk chennai cop molests 18 year old girl student in public

ఖాకీ చొక్కా వేసుకుని తప్పుడు దారిలో వెళ్లే పోలీసుల ఉదంతాలు రాను రాను పెరిగిపోతున్నాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో వారి భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో వారికి భద్రత కల్పించాల్సిందిపోయి, వారిపై దాష్టీకాలకు ఎగబడిపోతున్నారు. గత రాత్రి చెన్నైలో ఇలాంటి ఉదంతమే ఒకటి బయటపడింది.

కాథిపారా ఫ్లైఓవర్ సమీపంలో ఒంటరిగా ఉన్న ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడపోయాడు ఓ కానిస్టేబుల్. పీకల దాకా తాగిన అతగాడు మద్యం మత్తులో కామం ఆవహించి ఓ 18 ఏళ్ల యువతిని బలత్కారం చేయబోయాడు. జెరాల్డ్ గిబ్స్(30) అనే కానిస్టేబుల్ చిత్తుగా తాగి, ఆపై రోడ్లపై తూలుతూ తిరుగుతున్నాడు. బస్టాప్ లో నిల్చున్న ఓ యువతిపై అతగాడి కన్ను పడింది. చుట్టూ జనాలు చూస్తున్నారన్న విచక్షణ మరిచి ఒక్కసారిగా మృగంలా ఆ అమ్మాయిపై పడ్డాడు. ఆమె బట్టలు చించుతూ చెప్పుకోరాని చోటలా తాకి, చివరకు అత్యాచార ప్రయత్నానికి సిద్ధపడ్డాడు. పోలీస్ యూనిఫాంలో ఉండటంతో అడ్డుకునేందుకు ఎవరూ సాహసించకపోగా, అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్లు కొందరు అతగాడిని అడ్డుకోబోయారు.

Chennai Cop Molesting Girl

ఇక అమ్మాయిని వదిలేసిన ఆ కానిస్టేబుల్ క్యాబ్ డ్రైవర్లను కొట్టడం ప్రారంభించారు. ధైర్యంగా చేసిన కొందరు డ్రైవర్లు అతన్ని నిలువరించి, దేహశుద్ధి చేశారు. ఇంతలో అటుగా పెట్రోలింగ్ వచ్చిన పోలీసులకు అతన్ని అప్పజెప్పారు. అయితే విచారణ పేరుతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆపై విడుదల చేశారంట. ఇంకోవైపు ఫిర్యాదు చేయడం లాంటివి చేయొద్దంటూ ఆ యువతి పెరేంట్స్ కి బెదిరింపులు కూడా వచ్చాయంట.

కానీ, క్యాబ్ డ్రైవర్లు మీడియా ముందుకు వచ్చి అసలు విషయం చెప్పటంతో వ్యవహారమంతా వెలుగులోకి వచ్చింది. జెరాల్డ్ గతంలో తమను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు క్యాబ్ డ్రైవర్లు చెబుతున్నారు. విషయం మీడియాకు ఎక్కటంతో అతన్ని అరెస్ట్ చేసి, విచారణ చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Cop  try to  Rape  Girl  Molest  

Other Articles