Telugu states CMs, YS jagan, congratulate silver medallist Sindhu

President pm rahul congratulate silver medallist sindhu

Olympics 2016, India, Badminton, Rio 2016 Badminton, PV Sindhu, sindhu enters final, Badminton Finals, Badminton, Carolina Marin, Narendra Modi, Pranab Mukherjee, Rio De Janeiro, Sonia Gandhi, Congress, Rahul Gandhi, chandrababu naidu, chandrashekar rao, KCR, YS Jagan, latest Olympics 2016 news, olympics news

President Pranab Mukherjee, Prime Minister Narendra Modi and Congress President Sonia Gandhi congratulated shuttler P.V. Sindhu, who clinched a historic silver at the Olympics in Rio de Janeiro

మన ‘వెండి’కొండ సింధుకు అభినందనల వెల్లువ..

Posted: 08/19/2016 10:46 PM IST
President pm rahul congratulate silver medallist sindhu

రియో ఒలింపిక్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్స్ లో రజత పతకం సాధించిన సింధుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వించదగ్గ ఆటతీరుతో సిల్వర్ మెడల్ గెలుచుకుందని రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అభినందిస్తున్నారు. రజతపతకం సాధించిన పీవీ సింధు దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడారు. భారత ఒలింపిక్ లో రజత పతకాన్ని సాధించి ఒలంపిక్స్ నూతన చరిత్రను సింధూ నెలకొల్పిందని ఆయన అభినందించారు.

ఫైనల్ లో సింధూ పోరాట పటిమను ప్రధానమంత్రి నరేంద్రమోడీ శ్లాఘించారు, సింధూ సాధించిన రజతంతో పాటు అమె నెలకొల్పని చరిత్రను ఏళ్ల పాటు భారతీయులు గుర్తుపెట్టుకుంటారని అయన తన అభినందనలు తెలిపారు, భరతమాత కిర్తి కిరీటంలో మరో అత్యంత విలువైన వజ్రాన్ని సింధూ అమర్చిందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అభినందించారు, సింధు సాధించిన విజయం తరతరాలకు, భావితరాలకు ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుందని కొనియాడారు. వీరితో పాటు కేంద్ర క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ సహా క్రీడా ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా సింధుకు అభినందనలు తెలిపారు.

సింధు విజయం మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తుందని, ఈ స్పూర్తితో టోక్యో ఒలింపిక్స్ లో ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. సింధు విజయం ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. అద్భుత విజయం సాధించిన సిందు మహిళలందరికీ స్పూర్తినిచ్చే విజయం సాధించిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అభినందించారు. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు ఒలింపిక్స్ లో రజతపతకం సాధించిన సింధు, దేశం గర్వించేలా చేసిందని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Pranab Mukherjee  Rio De Janeiro  Sonia Gandhi  Congress  Rahul Gandhi  

Other Articles