Hillary Clinton's lead over Donald Trump narrows to 4 points

Clinton leads trump by 4 points

Clinton Leads Trump By 4 Points, Clinton Leads Trump, Republican, Pew Research Center, Hillary Clinton, Donald Trump, Democratic, US presidential elections, America,

Democratic presidential candidate Hillary Clinton's lead over her Republican rival Donald Trump has narrowed to 4 points, according to a new nationwide poll

అగ్రరాజ్య అధ్యక్షపీఠం ఎవరి వశం.? హిల్లరికీ స్వల్ప అధిక్యం..

Posted: 08/19/2016 05:57 PM IST
Clinton leads trump by 4 points

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు చివరి అంకానికి చేరుకున్న తరునంలో అధక్ష్య పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారా..? అన్న ఉత్కంఠ అగ్రరాజ్యవాసులలో నెలకోంది. రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన డోనాల్డ్ ట్రంప్. డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మధ్య ముఖాముఖీగా జరుగుతున్న పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న ఉత్కంఠ ఓటర్లలో నెలకోంది. డెమొక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచిన హిల్లరీ క్లింటన్ అగ్రరాజ్యానికి జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలలో తలపడుతున్న తొలి మహిళగా ఇప్పటికే చరిత్రను తిరగరాయగా, అధ్యక్ష పీఠాన్ని కూడా అధిరోహించి మరో రికార్డును కూడా నెలకొల్పుతారా..? అన్న ప్రశ్నలు తెరపైకివస్తున్నాయి.

అయితే ఇందుకు అవునన్న సమాధానాలే వినబడుతున్నాయి. జాతీయ పోల్ సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు వెల్లడవుతోంది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్పై స్వల్పంగా 4 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ కొనసాగుతున్నారని తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ పోల్ పేర్కొంది. తగ్గాపోరుగా ఈ ఇద్దరి నేతలు అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాతీయ పోల్స్ అన్నింటిలో కూడా హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడైంది. తాజా పోల్ సర్వేలో ఆధిక్య పాయింట్లను హిల్లరీ కోల్పోయినప్పటికీ, 4 పాయింట్లతో ముందంజలోనే ఉన్నారని ప్యూ సర్వే తెలిపింది.

ఒకవేళ అమెరికాకు నేడే ఎన్నికలు జరిగితే 41 శాతం మంది రిజిస్ట్రర్ ఓటర్లు హిల్లరీకే మద్దతు పలుకుతారని ప్యూ సర్వేలో వెల్లడైంది. 37 శాతం ట్రంప్కు మొగ్గుచూపుతున్నట్టు సర్వే తెలిపింది. ఈ ఏడాది మొదటి వరకు చాలామంది ఓటర్లు అమెరికా అభ్యర్థిత్వానికి క్లింటన్ లేదా ట్రంప్ల్లో ఎవరు సరియైన వారో పోల్చుకోవడంలో సందిగ్థతలో ఉండేవారని.. ప్రస్తుతం క్లారిటీతో ఓటర్ల అభిప్రాయాలు వెల్లడవుతున్నట్టు సర్వే వివరించింది. కేవలం 27 శాతం మందే ట్రంప్ను అమెరికాకు గ్రేట్ ప్రెసిడెంట్గా అభివర్ణిస్తున్నారు.

అయితే దానికి రెట్టింపు శాతం మంది అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ట్రంప్ను పోల్చుతున్నారని సర్వే తెలిపింది. 15 శాతం మంది ట్రంప్..యావరేజ్ ప్రెసిడెంటని చెబుతున్నట్టు పేర్కొంది. ట్రంప్ కంటే ఆధిక్యంలో గ్రేట్ ప్రెసిడెంట్గా హిల్లరీనే ఓటర్ల మన్ననలను పొందుతున్నారని.. 31 శాతం మంది హిల్లరీ గ్రేట్ ప్రెసిడెంట్ అంటూ తెగ పొగిడేస్తున్నారట. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు 9-16 మద్యలో 2,010 మందితో(1,567 రిజిస్ట్రర్ ఓటర్లు కలిపి) ప్యూ రీసెర్చ్ ఈ తాజా సర్వే నిర్వహించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Republican  Pew Research Center  Hillary Clinton  Donald Trump  Democratic  America  

Other Articles