కరువు గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ | Sachin Tendulkar Adopts Drought Affected Village from Maharashtra

Sachin tendulkar adopts drought affected village from maharashtra

Sachin Adopt Village, Sachin in Donja village, Sachin Drought affected village, Sachin the Sansad Adarsh Gram Yojna

Sachin Tendulkar Adopts Drought Affected Donja Village from Maharashtra.

కరువు గ్రామంపై కన్నేసిన సచిన్

Posted: 08/18/2016 04:27 PM IST
Sachin tendulkar adopts drought affected village from maharashtra

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైదానంలో అయితే రాణించాడు కానీ రాజకీయాల్లో ఇంకా ఓనమాల స్టేజీలోనే ఉండిపోయాడు. రాజకీయాల్లోకి రావాలన్న ఉద్దేశం లేకపోయినప్పటికీ పరిస్థితుల ప్రభావంతో ఆయన రాజ్యసభ సభ్యుడిగా మారాల్సి వచ్చింది. ఎంపీగా ఉన్నాడన్న పేరు మాత్రమే గానీ మిగతా నేతల్లా బిల్డప్పులు ఇచ్చిన పాపాన ఆయన పోలేదు. పైగా సమాజ సేవ అంటే చాలూ ఆయన ఎప్పుడూ ముందుంటాడు కూడా.

ఆ మధ్య దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన లో భాగంగా సచిన్ టెండుల్కర్ కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారికండ్రిగ. ఎంపీ నిధులతో ఆ దత్తత గ్రామం అద్భుతంగా తీర్చిదిద్దటంతోపాటు, ఆదర్శ గ్రామంగా జాతీయ పురస్కారం దక్కేలా కూడా చేశాడు.ఇక ఇప్పుడు మరో గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నాడు ఈ లెజెండరీ క్రికెటర్.

మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలోని కరువు బాధిత గ్రామం అయినా దోంజా ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకం ప్రతీ పార్లమెంట్ సభ్యుడు రెండు గ్రామాలను దత్తత తీసుకోవాల్సి ఉండగా, ఇప్పటికే ఒక ఊరిని ఆదర్శంగా దిద్దిన మాస్టర్ ఇప్పుడు ఈ దోంజాని కూడా పచ్చగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sachin Tendulkar  Donja village  Maharashtra  adopted  

Other Articles