జగన్ కోసం రాజకీయ వ్యూహకర్త| will Jagan uses political strategist and advisors for next elections

Will jagan uses political strategist and advisors for next elections

YS Jagan Prashant Kishor, Jagan use political strategist and advisors, Jagan fear for next elections, jagan new strategy for next elections, political strategist and advisors AP elections

will Jagan uses political strategist and advisors for next elections.

గెలుపు కోసం జగన్ అంత పని చేస్తాడంటారా?

Posted: 08/18/2016 03:53 PM IST
Will jagan uses political strategist and advisors for next elections

రెండో దఫా అధికారంలోకి రాకుంటే రాజకీయ ప్రస్థానం ముగిసినట్లేనని కార్యకర్తలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు జగన్ లో నెలకొన్న ఆందోళన తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత తన మైండ్ సెట్ ను నెమ్మదిగా మార్చుకుంటున్నాడని తెలుస్తోంది. మోనార్క్ లా వ్యవహారిస్తూ ఎవరి మాటా వినకపోవటం వల్ల కీలక నేతలను కోల్పోవటంతోపాటు ఈ పరిస్థితి దాపురించిందని స్పెషల్ గా విశదీకరించనక్కర్లేదు. అందుకే జాతీయ పార్టీల బాటలోనే నడించేందుకు ఆయన వ్యూహారచన చేస్తున్నాడని అర్థమౌతోంది.

చాయ్ పే చర్చ నుంచి పలు అంశాల్ని ఓటు బ్యాంకుగా మార్చిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీహార్ ఎన్నికల్లో నితీష్ వెన్నంటి ప్రచార వ్యూహాల్ని రచించారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం వ్యూహకర్తగా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నారు. త్వరలోనే ప్రశాంత్ కిషోర్ తరహా వ్యూహకర్తల్ని జగన్ నియమించుకోబోతున్నాడని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గడచిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోదీ... రాజకీయ వ్యూహకర్తగా మారిన ప్రశాంత్ కిశోర్ సేవలను విరివిగా వినియోగించుకున్నారు. ఫలితంగా ఆ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత భారీ విజయాన్ని బీజేపీ దక్కించుకుంది. ఆ తర్వాత సొంత రాష్ట్రం లో జరిగిన ఎన్నికలకు నితీశ్ కుమార్ కు సేవలందించి ఆయన్ని ముఖ్యమంత్రి పీఠంపైనా కూర్చోబెట్టాడు. ప్రస్తుతం యూపీ ఎలక్షన్స్ కి హస్తంకి చెయ్యి అందిస్తున్నాడు.

ఈ క్రమంలో జాతీయ పార్టీల గెలుపు మంత్రం రాజకీయ వ్యూహకర్త సేవలను వినియోగించుకునేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే అది ప్రశాంత్ కిషోరేనా? కాదా? లేదా ఆయన అనుచర గణంలోని వ్యక్తులా? అన్నది వేచి చూడాలి. ఈ మేరకు లోటస్ పాండ్ లో జరిగిన పార్టీ కో-ఆర్డినేటర్ల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు విశ్వసనీయ సమాచారం.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YS Jagan  2019 elections  political strategist and advisors  

Other Articles