ఏపీకి ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం | Central released economical fund to Andhra Pradesh

Central government announces financial aid to ap

Central Government Announces Financial Aid to AP, Financial Aid to AP, Central special fund to AP, Central special fund to Amaravathi

Central released economical Aid release fund to Andhra Pradesh.

ITEMVIDEOS:ఏపీకి ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం

Posted: 08/18/2016 01:43 PM IST
Central government announces financial aid to ap

ఏపీ ప్రజలకు కాస్త ఊరటనిస్తూ కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించింది. సింగిల్ విడతలో రూ.1,976 కోట్లను విడుదల చేసిన కేంద్రం... వాటిలో ఏఏ పనులకు ఎంత మొత్తాన్ని విడుదల చేస్తున్నామన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. తాజాగా విడుదలైన నిధుల్లో ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యమిచ్చిన కేంద్రం... అందుకోసం రూ.1,176 కోట్లను కేటాయించింది. ఇక నవ్యాంద్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి గాను రూ.450 కోట్లను విడుదల చేసిన కేంద్రం... వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ.350 కోట్లను విడుదల చేసింది.

అయితే హోదా కంటే ఎక్కువ ప్యాకేజీనే ఇస్తామని, హోదాతో 30 శాతం నిధులే అదనంగా వస్తాయని, అంతకన్నా ఎక్కువ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పార్లమెంట్ ఆవరణలో మీడియాతో జైట్లీ చెప్పారు. ఈ క్రమంలో నేడు ఆర్థిక ప్యాకేజీ విడుదల చేయటం విశేషంగా చెప్పుకోవచ్చు. అంతే కాదు విభజన సమయంలో రాజ్యసభ ముఖంగా నాడు ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ఈ ఆర్థిక లోటు భర్తీ చేయటంతోపాటు, మిగతా ఐదేళ్లకు కూడా కేంద్రం నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఏటా పలు దఫాలుగా సుమారు 3వేల కోట్లకు పైగానే ఐదేళ్లపాటు అందించనుందని సమాచారం అందుతోంది. విభజన చట్టంలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని, పదో షెడ్యూల్ ప్రకారం నోడల్ ఏజెన్సీ అంశాలను కూడా ఆర్థిక శాఖను సంప్రదించి అన్నీ హామీలను నెరవేర్చే విధంగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఇప్పటికే ఇచ్చిన పారిశ్రామిక రాయితీలే కాకుండా మరిన్ని ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం తప్పటడుగు వేసినా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని గమనించిన కేంద్రం, ఏపీ సర్కారును ప్రసన్నం చేసుకునేందుకు తనదైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీకి వివిధ పద్దుల కింద నిధులను విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. అతి త్వరలోనే మరో దఫా ఆర్థిక సాయం విడుదల చేసే అవకాశం ఉన్నట్లు కేంద్ర వర్గాలు చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Central  economical Aid  release  fund  Andhra Pradesh.  

Other Articles