police raids prostitution house in echerala town, 5 held along with cine actress

Tollywood actress caught red handedly in prostitution

prostitution gang arrest, srikakulam district, cinema artist, cine Actress, echerla town srikakulam district, tollywood actress prostitution, hero ram

with a tip o information police conducted raids in srikakulam district echerla towm and red handedly caught prostituiton racket, in which tollywood actress also held.

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ సినీ నటి..

Posted: 08/18/2016 11:23 AM IST
Tollywood actress caught red handedly in prostitution

ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలోని ఒన్‌టౌన్ పరిధిలో గల అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నుడుస్తుందన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు విటులతో పాటు ముగ్గురు మహిళలు కూడా వున్నారు. భార్య భర్తలుగా నటిస్తూ సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. వీరిలో ఒకరు సినీనటి కూడా వున్నారు. పక్షం రోజుల కిందట ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో పట్టుబడ్డ వ్యభిచార ముఠా మరోసారి పట్టణంలోని వన్‌టౌన్ పరిధిలో దిగి ఈ కర్యకలాపాలకు పాల్పడుతుందని తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాలు మేరకు...స్దానిక టిపిఎం స్కూల్ వెనుక గల సాయిమౌళి అపార్ట్‌మెంట్స్‌లో (రూంనెంబర్-909) గడిచిన కొద్ది రోజులుగా ఈప్రాంతంలో కొత్తవ్యక్తులు సంచరిస్తున్నారు. స్దానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాటువేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ఐదుగురిని పట్టుకున్నామని  పోలీసులు తెలిపారు. ఆమదాలవలస మండలం అక్కివరంకు చెందిన తాండ్ర శ్రీనువాసరావుతో పాటు మరో మహిళ భార్యభర్తలుగా చెలామణి అవుతూ కొత్త వ్యక్తులచే అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణలో వెల్లడయ్యింది.

వీరిద్దరూ విశాఖపట్నం, విజయనగరంకు చెందిన మహిళ ను తీసుకొచ్చి ఇటుంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం పట్టుబడ్డ వారికిలో ఇద్దరు విటులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. శ్రీనుకు విశాఖపట్నం, వియనగరంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు చెందిన కొంతమంది  అమ్మాయిలతో  పరిచయాలు ఉన్నాయని  కమీషన్ పద్దతిపై అసాంఘీక కార్యక్రమాలకు శ్రీను ఆధ్యం పోస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. 15రోజులు క్రితమే శ్రీనుతో పాటు మరో మహిళను వ్యభిచారం కేసులో ఎచ్చెర్ల పోలీస్టేషన్ పరిధిలో అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు.

ఇదిఇలావుండగా పట్టుబడ్డ ముగ్గురి మహిళల్లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ తాను సినీ నటినని చెప్పింది. రామ్ సరసన ఓ కొత్తసినిమాలో గెస్ట్‌రోల్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆ సినిమా సూటింగ్ దశలో ఉందని ఆమె వెల్లడించింది.  రాఖి పండుగ సందర్భంగా తన ఫ్రెండ్ ఇంటికి వచ్చానని విలేకరులకు తెలిపింది అంతేకాకుండా కొన్ని టివీ సీరియల్స్‌లో నటిస్తున్నట్లు చెప్పింది. పట్టుబడ్డ విటుల నుంచి ఒన్‌టౌన్ పోలీసులు రూ.15వందల రూపాయలు నగదుతో పాటు రెండు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles