కొత్తగా 27 జిల్లాలు | KCR finalised 27 districts of new telangana

Kcr finalised 27 districts of new telangana

27 new districts, Telangana New Districts, Telangana KCR districts, KCR new districts, 27 districts of new telangana, Sub Committee Report on Telangana new districts, All Party meeting for new districts, All Party Meeting in Telangana

KCR finalised 27 districts of new telangana.

జిల్లాల సంఖ్య ఎందుకు మారిందంటే...

Posted: 08/18/2016 11:12 AM IST
Kcr finalised 27 districts of new telangana

మారుతున్న కొత్త జిల్లాల సంఖ్య తో గందరగోళం నెలకొనగా, ఎట్టకేలకు పునర్విభజన అంశం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. కొత్త రాష్ట్రం తెలంగాణలో పరిపాలనను మరింత సులభతరం చేసేందుకు జిల్లాల పునర్విభజనకు నడుం బిగించిన కేసీఆర్ ప్రభుత్వం... ఎట్టకేలకు ఆ కసరత్తును పూర్తి చేసింది. సుదీర్ఘ అధ్యయనం, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ నివేదికను బుధవారం సీఎం కేసీఆర్ కు అందజేసింది. నివేదికను మరోమారు పరిశీలించిన కేసీఆర్ ఈ ప్రతిపాదనకు దాదాపు ఓకే చేశారని, కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిపోయినట్లేనన్న వాదన వినిపిస్తోంది.

తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను మొత్తం 27 జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ నివేదించింది. అదే సమయంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్యను కూడా 44 నుంచి 74కు, మండలాల సంఖ్యను 459 నుంచి 533కు పెంచాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. పాలనపరంగా ఇబ్బందులతోపాటు, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులు, ఆందోళనల దృష్ట్యా జిల్లా కేంద్రానికి దగ్గర్లో ఉన్న ప్రాంతాలను కొత్త వాటిల్లో కలిపేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇక నివేదికపై హడావుడిగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్, అఖిలపక్షం భేటీ నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ అంశంపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ నిన్న తన నివేదికను సీఎం కేసీఆర్ కు అందజేసింది. ఈ నివేదికకు కేసీఆర్ యథాతథంగా ఆమోదం తెలిపితే... కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు కింది విధంగా వుంటాయి.

Telangana 27 New Districts


1. ఆదిలాబాదు జిల్లాలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల
2. కరీంనగర్ జిల్లా... పెద్దపల్లి, జగిత్యాల
3. వరంగల్ జిల్లా... హన్మకొండ, మహబూబాబాదు, భూపాలపల్లి
4. మెదక్ జిల్లా... సంగారెడ్డి, సిద్దిపేట
5. నిజామాబాదు జిల్లా... కామారెడ్డి
6. ఖమ్మం జిల్లా... కొత్తగూడెం
7. నల్గొండ జిల్లా... సూర్యాపేట, యాదాద్రి
8. మహబూబ్ నగర్ జిల్లా... నాగర్ కర్నూలు, వనపర్తి
9. మిగిలిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలను మొత్తం నాలుగు జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  All Party Meeting  New Districts  Telangana  

Other Articles