ఐరన్ నన్ గురించి మీకు తెలుసా? | Nike ad of 86-year-old Iron Man-racing nun goes viral

Nike ad of 86 year old iron man racing nun goes viral

nun Sister Madonna Buder, Iron Man-racing nun, Iron Nun Nike ad, Sister Madonna Buder nike ad, 86 old woman nike ad, Old woman Nike ad

Nike ad of 86-year-old Iron Man-racing nun Sister Madonna Buder goes viral.

ITEMVIDEOS:86 ఏళ్ల పెద్దావిడ ఏంటీ పనులు???

Posted: 08/18/2016 10:36 AM IST
Nike ad of 86 year old iron man racing nun goes viral

పట్టుదల, కార్యదీక్ష ఈ రెండు ఉంటే చాలూ మనిషి ఎలాంటి అవాంతరాలను దాటైనా లక్ష్యాలను సాధించవచ్చు. లేటు వయసులో తన కోరికను చంపుకోని ఓ పెద్దావిడ ఎంతటి సాహసం చేసిందో తెలిస్తే ఎవరైనా ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ప్రస్తుతం క్రైస్తవ సన్యాసిని వీడియో ఒకటి యూట్యూబ్ లో సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్లితే... అమెరికాకు చెందిన 86 ఏళ్ల సిస్టర్ మడోనా బుడర్ కు చిన్ననాటి నుంచి అథ్లెటిక్స్ అంటే ఎంతో ఇష్టం. నన్ గా మారినప్పటికీ ఆమె అథ్లెటిక్స్ ను మర్చిపోలేదు. కుదిరినప్పుడల్లా ప్రాక్టీస్ చేశారు. అలా ప్రాక్టీస్ చేస్తూ, ఇప్పటి వరకు 40 సార్లకు పైగా అత్యంత కఠినమైన 'ఐరన్ మ్యాన్' రేసులో పాల్గొన్నారు. దీంతో ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. వారంతా ఆమెను 'ఐరన్ నన్' అని ప్రేమగా పిలుచుకుంటారు.

Iron Nun Nike Ad

ఈ రేసులో భాగంగా 180 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించాలి. ఆ తరువాత 42 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. ఆ తరువాత 3.8 కిలోమీటర్ల దూరం ఈత కొట్టాలి. ఇవన్నీ ఎవరు తొందరగా అధిగమిస్తే వారు ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటారు. కానీ, ఇంత కఠినమైన పోటీల్లో ఆమె 40 సార్లకు పైగా పాల్గొన్నారంట. ఈ వృద్ధ నన్ ఈ ఈవెంట్ లో పాల్గొనటంపై ప్రముఖ స్పోర్ట్స్ వేర్ సంస్థ నైక్ 'అన్ లిమిటెడ్ యూత్' పేరుతో ఒక యాడ్ రూపొందించింది. ఈ వీడియోను ఆగస్టు 14న విడుదల చేయగా, హాట్ హాట్ గా వైరల్ అయిపోతుంది. కేవలం ఒక్క రోజులోనే 12 లక్షల మంది దానిని వీక్షించడం విశేషం. అన్నీ సక్రమంగా ఉండి బద్ధకించే యువత ఈ వయసులోనూ ఆవిడ చేస్తున్నసాహస ఫీట్లను చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఆ వీడియోను మీరూ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Iron Nun  Sister Madonna Buder  Nike Ad  Iron Run Race  

Other Articles