Wrestler Sakshi Malik won Bronze medal at Rio Olympics | రియో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్

Wrestler sakshi malik ends india s medal drought with a bronze in rio olympics

Wrestler Sakshi Malik, Wrestler Sakshi Malik bronze medal, Sakshi Malik at Rio Olympics, India first medal in Rio, Sakshi Malik bio graphy, Sakshi Malik history, Sakshi Malik wrestler, women who got medal in Olympics, Sakshi malik birth place, Sakshi Malik background

Wrestler Sakshi Malik ends India's medal drought with a bronze in Rio olympics.

రియో ఒలంపిక్స్ లో భారత్ బోణీ... రెజ్లింగ్ లో సాక్షికి కాంస్యం

Posted: 08/18/2016 08:47 AM IST
Wrestler sakshi malik ends india s medal drought with a bronze in rio olympics

రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో మట్టి కరిపించి భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. తొలుత ‘రెప్‌చేజ్’ బౌట్‌లో సాక్షి 12-3తో ఒర్ఖాన్ ప్యూర్‌దోర్జ్ (మంగోలియా)పై గెలుపొందింది. ఆపై క్వార్టర్ ఫైనల్లో సాక్షి 2-9తో వలెరియా కొబ్లోవా (రష్యా) చేతిలో ఓటమి చెందింది. కానీ సాక్షిపై నెగ్గిన రష్యా రెజ్లర్ కొబ్లోవా ఫైనల్‌కు చేరుకోవడంతో భారత రెజ్లర్‌కు మరోసారి ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం వచ్చింది. దీంతో అదృష్టం ఈ లేడీ సుల్తాన్ ను కాంస్యం రూపంలో వరించింది.

ఎవరీ సాక్షి:


23 ఏళ్ల సాక్షిమాలిక్ 1992 సెప్టెంబర్ 3న హర్యానా రోహతక్ లోని మెక్రా గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. 12 ఏళ్ల వయసు నుంచే కుస్తీ పోటీల్లో పాల్గొనటం ప్రారంభించింది. గురువు ఈశ్వర దాహియా శిక్షణలో చోటు రామ్ మైదానంలో రాటుదేలింది. అక్కడ చాలా మంది అబ్బాయిలు రెజ్లింగ్ అమ్మాయిలకు కాదని సాక్షిని గేలి చేసేవారంట. ఈ విషయంలో కోచ్ దాహియాకు చాలాసార్లు అవమానాలు కూడా ఎదరయ్యాయంట. అయినా వినకుండా పట్టుదలతో ఆమెకు సాధన ఇచ్చాడాయన. 2010 లో 18 ఏళ్ల ప్రాయంలో తొలిసారి జూనియర్ లెవల్ లో కాంస్య పతకం సాధించిన సాక్షి ఆపై తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంచింది. 2014 కామన్ వెల్త్ క్రీడల్లో సిల్వర్ పతకం సాధించడంతోపాటు గతేడాది సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ చాంఫియన్స్ షిఫ్ గేమ్స్ లో పాల్గోని కాంస్య పతకం గెలుపొందింది.

2015లో అంతర్జాతీయ చాంపియన్ షిప్ లో పాల్గొని రియో ఒలంపిక్స్ కు అర్హత సాధించింది. ఆశలు పెట్టుకున్న వారు ఒక్కోక్కరుగా నిష్క్రమిస్తున్న తరుణంలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సాక్షి పతకం సాధించడం నిజంగా విశేషం. 1.62 ఎత్తు, 64 కేజీల సాక్షి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా సాక్షి మాలిక్ నిలిచింది. మొదటి మూడు స్థానాల్లో వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరీ(2000, సిడ్నీ), బాక్సర్ మేరీకోమ్(2012, లండన్), షటర్ల్ సైనా నెహ్వాల్(2012, లండన్).

Sakshi Malik medal at Rio

sakshi rio olympics

Sakshi Malik bronze medal

మాలిక్ విజయం సాదించిన వెంటనే స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. భారత క్రీడాకారులకు సాక్షి మాలిక్ మార్గదర్శకురాలిగా నిలిచిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా ఆమె విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రైజ్ మనీ:

కాగా, ప్రస్తుతం హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు. హర్యానా ప్రభుత్వం 2 కోట్ల ప్రౌజ్ మనీతోపాటు భూమి, ఇండియన్ రైల్వేలో ఉద్యోగంతోపాటు 50 లక్షలు, ఇండియన్ ఒలంపిక్స్ అసోషియేషన్ నుంచి 20 లక్షలు, జెఎస్ డబ్ల్యూ గ్రూప్ నుంచి 15 లక్షలతోపాటు సల్మన్ ఖాన్ ప్రకటించిన 1 లక్ష రూపాయలు సాక్షి సొంతం కానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sakshi Malik  Wrestler  58 kgs  Rio Olympics  Bronze medal  

Other Articles