Bareilly dargah issues fatwa against KFC outlet

Fatwa against kfc says eating there is a sin

chicken, kentuky fried chicken, kfc, sin, halaal, fatwa, bareilly, bareilly dargah, bareilly kfc, dargah issues fatwa against kfc, halal meat, kfc bareilly, dargah-e-ala hazrat , lucknow news, india news

A team of Dargah-e-Ala Hazrat visited the particular outlet where the authorities showed them a certificate issued by a Mufti of Mumbai.

కేఎఫ్‌సీలో చికెన్ తింటే పాపం.. పత్వా జారీచేసిన మతపెద్దలు

Posted: 08/16/2016 10:09 PM IST
Fatwa against kfc says eating there is a sin

ముస్లిం మత పెద్దలు ఓ సంస్థ విక్రయిస్తున్న చికెన్ ను తినకూడదంటూ ఏకంగా తమ మతస్థులపై ఆంక్షలు విధించారు. అదేంటి తినే తిండిపై కూడా అంక్షలు విధంచడమేంటి..? అందులోనూ అనేక బహుళజాతీ సంస్థలను వదలిపెట్టి కేవలం ఒక సంస్థ విక్రయించే చికెన్ పైనే అంక్షలు విధించడం సమంజసమేనా..? అంటూ అలోచనలో పడ్డారు. ఇక మరో విషయం చెబితే ఏమంటారో..? అదేంటి అంటే ఆ సంస్థ విక్రయించే చికెన్ తింటే తప్పక పాపం తగులుతుందని కూడా చెప్పారు మతపెద్దలు. ఎందుకిలా..? అంటూ అలోచనలో పడకండి.

వివరాల్లోకి వెళ్తే.. కెంటకీ ఫ్రైడ్ చికెన్ (కేఎఫ్‌సీ)లో చికెన్ తింటే అది పాపం అవుతుందని, అందువల్ల అక్కడ తినొద్దని దర్గా-ఎ-అలా హజరత్ మతపెద్దలు చెప్పారు. కేఎఫ్‌సీ ఔట్‌లెట్లలో అందించే చికెన్ హలాల్ చేసినది కాదని, అందువల్ల అది ఇస్లామిక్ చట్లాలకు లోబడి ఉండదని సీనియర్ ముఫ్తీ సలీమ్ నూరీ తెలిపారు. కేఎఫ్‌సీలో మాంసాన్ని ముస్లింల కళ్లెదుట ప్రాసెస్ చేయరని, అందువల్ల అది ఇస్లామ్ నిబంధనల ప్రకారం తప్పని ఆయన అన్నారు.

ఈ స్టోర్ల వద్ద ప్రదర్శించే హలాల్ సర్టిఫికెట్లకు ఏమాత్రం విలువ లేదని, మాంసాన్ని ప్రాసెస్ చేయడానికి తాము ఎలాంటి విధానాలు అవలంబిస్తామో వాళ్లు అందులో రాయట్లేదని నూరీ చెప్పారు. కేఎఫ్‌సీ వాళ్లు ఇస్లామిక్ పద్ధతిలో మాంసాన్ని వండరు కాబట్టి షరియత్ చట్టానికి అది వ్యతిరేకమని ముఫ్తీ తెలిపారు. ఇంతకుముందు 'పోకెమన్ గో' ఆడటాన్ని కూడా ఇస్లాం ప్రకారం తప్పంటూ ఇదే మతపెద్ద ఓ ఫత్వా జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chicken  kentuky fried chicken  sin  halaal  bareilly  dargah-e-ala hazrat  fatwa  

Other Articles