బీహార్ లో జీఎస్టీ పాసయ్యింది | Bihar becomes first Opposition ruled state to ratify GST Bill

Bihar becomes first opposition ruled state to ratify gst bill

first Opposition ruled state GST, Bihar ratify GST Bill, Nitish on GST

Bihar becomes first Opposition ruled state to ratify GST Bill.

మోదీకి హడావుడి సపోర్ట్ ఎందుకయ్యా?

Posted: 08/16/2016 02:50 PM IST
Bihar becomes first opposition ruled state to ratify gst bill

మోదీ మానసపుత్రికకు ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ, ఆపై తాజాగా లోక్ సభ ఆమోదించిన సంగతి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఒకే ప‌న్ను విధానం తీసుకొస్తూ చ‌ట్టం చేసిన కేంద్రం ఆ బిల్లును ఆయా రాష్ట్రాల ఆమోదం కోసం పంపింది. ఇప్పుడు రాష్ట్రాల ఆమోదం కోసం చక్కర్లు కొడుతోంది. అయితే సగం రాష్ట్రాలు జీఎస్టీని ఆమోదిస్తేనే చట్టపరంగా ముందుకు సాగటానికి వీలుంటుంది.

ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం అసోం ఆమోదించిన సంగతి తెలిసిందే. బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి తొలిరాష్ట్రంగా అసోం ప్రత్యేకతను చాటుకుంది. ఇక మంగళవారం బీహార్ కూడా జీఎస్టీ సవరణ బిల్లుకు ఆమెదం తెలిపింది. దీంతో ఈ జాబితాలో నిలిచిన రెండో రాష్ట్రంగానే కాదు, తొలి ఎన్డీయేత‌ర రాష్ట్రంగా బీహార్ నిలిచింది. వాణిజ్యప‌న్నుల శాఖ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాద‌వ్ గురువారం బిల్లును అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టగా, మంగళవారం స‌భ్యులంద‌రూ అంగీకారం తెల‌ప‌డంతో బిల్లు పాస్ అయింది.

అయితే బీజేపీయేతర ప్రభుత్వం, పైగా మోదీ అంటే అస్సలు పడని నితీశ్ కుమార్ జీఎస్టీ బిల్లును ఇంత త్వరగా ఆమోదం చెబుతారని ఎవరూ ఊహించలేదు. దీని వెనుక చాలా స్కెచ్చే ఉంది. జీఎస్టీకి 2006 నుంచే జేడీ యూ మద్దతు ఇస్తూ వస్తోంది. ఎన్టీయే నుంచి బయటికొచ్చాక అయ్యాక కూడా బిల్లుకు మద్దతు ఇస్తోంది. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో బీహార్ కు న్యాయం జరగట్లేదన్న వాదన బలంగా వినిపిస్తున్న నితీశ్ జీఎస్టీ ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆలోచనలో ఉన్నాడు. అంతేకాదు బ్లాక్ మనీ లాంటి తీవ్ర మైన సమస్యకు చెక్ కూడా పెట్టేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నాడు. ఈ క్రమంలోనే జీఎస్టీకి త్వరగతిన మద్ధతు తెలిపాడని విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GST  Bihar  Nitish kumar  ratify  

Other Articles