బోయినపల్లి కాల్పుల నిందితుడు డాకూరి బాబు అరెస్ట్ | Dakuri Babu arrest live in TV9 Studio

Dakuri babu arrest live in tv9 studio

Dakuri Babu arrest, Dakuri Babu TV9 interview, Dakuri Babu arrest, Dakuri Babu live, Dakuri Babu interview, Dakuri Babu TV9 interview

Bowinpally firing Dakuri Babu arrest live in TV9 Interview.

ITEMVIDEOS:లైవ్ లో డాకూరి బాబు అరెస్ట్

Posted: 08/16/2016 02:03 PM IST
Dakuri babu arrest live in tv9 studio

సికింద్రాబాద్ బోయినపల్లిలో కలకలం రేపిన కాల్పుల నిందితుడు డాకూరి బాబును ఎట్టకేలకు టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వివాదంలో శివరాజ్ యాదవ్ ను హత్య చేసి, ఆపై కాంగ్రెస్ నేత యాదగిరిపై కాల్పులు జరిపి, మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ తప్పించుకుని తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా సాక్షిగా తాను లొంగిపోతానంటూ మహేశ్ అలియాస్ డాకూరి (డెక్కల) బాబు టీవీ 9 స్టూడియోలో లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా, పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్లారు.

అయితే అరెస్ట్ కు ముందు డాకూరి బాబు పలు ఆసక్తికర విషయాలనే వెల్లడించాడు. అసలు యాదగిరిని చంపాలన్న ఉద్దేశం తనకు లేదని, కేవలం బెదిరించడానికే అలా కాల్పులు జరిపానని చెప్పుకోచ్చాడు. కాల్పుల తర్వాత మీడియాలో తన పేరు హైలెట్ కావటంతో ఆత్మహత్య చేసుకుందామనుకున్నా... కానీ, ధైర్యం చాలకే ఇలా మీడియా ముందుకు వచ్చి లొంగిపోతున్నా అని వెల్లడించాడు. ఉత్తరప్రదేశ్ లో గన్ లు చాలా సులువుగా దొరుకుతాయని, వాటి సాయంతోనే ఈ దాడికి పాల్పడ్డానని చెప్పాడు.

ఇక తనకున్న ఆర్థిక సమస్యలను బలహీనతగా చేసుకుని కొందరు తన జీవితంతో ఆడుకున్నారని అంటున్నాడు.. ‘‘నాకు అసలు మద్యం అలవాటు లేదు, యాదగిరి, మరో ఐదుగురు మిత్రులు తనకు మద్యాన్ని అలవాటు చేసి శివరాజ్ ను హత్య చేయించారు’’ అంటూ ఆరోపించాడు. శివరాజ్ ను హత్య చేస్తావా? నిన్ను లేపేయాలా? అని బెదిరింపలకు దిగటంతోనే తానీ దారుణానికి పాల్పడ్డానని వివరించాడు. తన కాలికి చుట్టుకున్న పాము చివరికి తలకు తగిలిందని అన్నాడు. తప్పు చేయకూడదనే అనుకున్నానని, కానీ తప్పలేదని, తన హత్యల వెనుక బీజేపీకి చెందిన నర్సింహ, యాదగిరి, కనకరాజు తదితరులు ఉన్నారని చెప్పాడు. దాదాపు రూ. 70 కోట్ల విలువైన భూమిని వారు ఆక్రమించారని ఆరోపించాడు. తాను హత్య చేసిన శివరాజ్ కుటుంబాన్ని ఆదుకోవాలని చూశానని, కానీ అందుకు పరిస్థితులు సహకరించలేదని చెప్పాడు.

 ఏదైతేనేం డాకూరి బాబును అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించిన పోలీసులు కేసు విచారణ వేగవంతమవుతుందని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dakuri Babu  arrest  TV9 studio  

Other Articles