Petrol price slashed by Re 1 per litre, diesel by Rs 2 per litre

Petrol to be cheaper by rs 1 per litre and diesel rs 2

petrol price, diesel price, petrol price decrease, diesel price decrease, petrol rate, diesel rate, petrol delhi, diesel delhi, delhi news, india news

The price of Petrol has been decreased by Re 1 per litre and the diesel price by Rs 2 per litre with immediate effect from midnight. This is the fourth time since July where rates have been slashed.

వాహనదారులకు శుభవార్త.. తగ్గిన ఇంధన ధరలు

Posted: 08/16/2016 10:46 AM IST
Petrol to be cheaper by rs 1 per litre and diesel rs 2

పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా క్రూడ్ అయిల్ ధరలు తగ్గడంతో సమీక్షించిన ఇంధన సంస్థలు వాహనదారులకు శుభవార్తను అందించాయి. లీటరు పెట్రోలుపై ఒక రూపాయి, డీజిల్ పై రెండు రూపాయల చొప్పున తాజాగా తగ్గాయి. ఈ తగ్గిన ధరలు గత అర్ధరాత్రి నుంచే అమలులోకి వచ్చినట్టు ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్ అయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తెలిపింది.

గత నెల 1వ తేదీ నుంచి పెట్రో ధరలు తగ్గడం ఇది నాలుగోసారి. ఈ నెల 1న పెట్రోలుపై లీటరుకు రూ.1.42, డీజిల్‌పై రూ.2.01 తగ్గింది. తాజా తగ్గింపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.61.09 నుంచి రూ.60.09కి, డీజిల్ ధర రూ.52.27 నుంచి రూ.50.27కు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల హెచ్చుతగ్గుల ఆధారంగా ప్రతి నెల 1, 16వ తేదీల్లో చమురు ధరలను ప్రభుత్వం సవరిస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol  dissel  prices  petrol prices  diessel price  petroleum products  

Other Articles