జగన్ ఎన్డీయేలోకి చేరాలని చూస్తున్నాడంటున్న నారా లోకేష్ | nara lokesh satire on Jagan that planning to join BJP led NDA

Nara lokesh satire on jagan that planning to join bjp led nda

Nara Lokesh satire on Jagan, Jagan plans to join in BJP led NDA, Jagan demand TDP to quit NDA

Nara Lokesh satire on Jagan that planning to join BJP led NDA says, no compromise on Special Status.

ఎన్డీయేలోకి జగన్ ఎలాగో తెలుసా?

Posted: 08/11/2016 11:15 AM IST
Nara lokesh satire on jagan that planning to join bjp led nda

ప్రత్యేక హోదా విషయంలో మిత్రపక్ష ఎన్డీయే కూటమికి గుడ్ బై చెప్పి బయటికి వచ్చేసి పోరాడాలని,  లేకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఏపీ అధికార పక్షానికి అన్ని పార్టీలు వార్నింగ్ ఇస్తున్నాయి. అస్సలు ఇచ్చే పరిస్థితి లేదంటూ ప్రకటన చేసినా ఇంకా ఎందుకు పట్టుకుని వెళాడుతున్నారంటూ సీఎం చంద్రబాబు పై విమర్శలకు దిగుతున్నాయి. వీటిలో ప్రతిపక్ష అధినేత గొంతుక కూడా ఉంది.

అయితే టీడీపీ ఎన్డీయే కూటమి నుంచి బయటికి రాగానే జగన్ వైఎస్సార్సీపీ బీజేపీతో దోస్తీ కడుతుందట. ఆ ఫ్లాన్ తోనే జగన్ ముందుకు సాగుతున్నాడంట.  ఈ మాటలు అంటుంది ఎవరో కాదు... చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్. చాలా రోజుల తర్వాత ప్రతిపక్షం, దాని అధినేత జగన్ ను టార్గెట్ చేస్తూ మాటల తుటాలు పేల్చాడు లోకేష్.

ప్రత్యేక హోదా విషయంలో ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని జగన్ పక్కదారి పట్టించి, జనాల్లో లేనిపోనివి సృష్టిస్తున్నాడు. ప్రత్యేక హోదా అన్నది చాలా కీలకమైన విషయం. ప్రభుత్వంలో మేమూ భాగస్వాములమే. అలాగని అన్యాయం జరగకుండా పోరాడాల్సిన భాద్యత మాపై ఉంది. కేంద్రం నుంచి బయటికి వచ్చేయమని జగన్ మాపై ఒత్తిడి తెస్తున్నాడు. ఎందుకు ఒకవేళ మేము బయటికి వస్తే ఆ స్థానే ఆయన వచ్చి చేరతారేమో అంటూ సెటైరిక్ గా వ్యాఖ్యానించాడు. ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, కోట్ల ప్రజల ఆకాంక్ష కోసం టీడీపీ పోరాడి తీరుతుందని లోకేష్ ఉద్ఘాటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDA  BJP  YS jaga  TDP  Nara Lokesh  YSRCP  

Other Articles