లైవ్ షోలో చిన్నారిని మింగేయాలనుకున్న సింహం | horrified baby screaming as lion tries to eat her on live TV

Horrified baby screaming as lion tries to eat her on live tv

horrified baby screaming, lion eat to children, Lion attack on children, Lion attack on baby, lion attack in TV show, lion attack on baby in TV show

The handlers of the lion try to tear it apart from the screaming baby and calm everybody down.

ITEMVIDEOS:లైవ్ లో సింహం చిన్నారిని మింగేయాలనుకుంది

Posted: 08/11/2016 09:40 AM IST
Horrified baby screaming as lion tries to eat her on live tv

సింహాలు దాడి చేసి మనుషులను చంపేసిన ఘటనలు చాలానే చూసినప్పటికీ ఇక్కడ ఓ లైవ్ షోలోనే అలాంటి ఘటన జరగబోయింది. మూడేళ్ల వయస్సున్న ఓ చిన్నారిని మృగరాజు మింగేయాలనుకున్న వీడియో ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది.

మెక్సికోలో ఓ టీవీ చానెల్ కు చెందిన కాన్ సెలో దే ముజేర్ అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఓ చంటి బిడ్డతో తల్లి హాజరుకాగా, పక్కనే సింహం దాని సంరక్షకుడు కూర్చుని ఉన్నారు. టీవీ ప్రజెంటర్ వారితో మాట్లాడుతు ఉండగా సడన్ పాప ఉన్నట్లుండి ఏడవటం ప్రారంభించింది. ఆ చిన్నారిని తదేకంగా చూస్తూ ఉన్న ఆ మృగరాజు ఒక్కసారిగా కాలు అందుకుంది.

అయితే అక్కడే ఉన్న ట్రెయినర్ అప్రమత్తంగా ఉండి దానిని వెనక్కిలాగాడు. అయినా ప్యాంట్ పట్టుకుని కాసేపు వదల్లేదు. ఆ దెబ్బకు భయంతో పాప విలవిలా ఏడ్చింది. సింహాన్ని పక్కకు తీసుకెళ్లగానే ముందు వణికి పోయిన ఆ తల్లి ఆ తర్వాత చిరునవ్వులు చిందించింది. అప్పటిదాకా సరదాగా సాగిన ఆ షో సింహం దెబ్బకి ఒక్కసారిగా భయంకరంగా మారినప్పటికీ పాప ఏ మాత్రం హాని జరగకుండా క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా 2007లో జరిగినప్పటికీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ వీడియోలో వైరల్ అవుతోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lion  attack  baby  live show  scream  

Other Articles