Chinese Boss Invents Naughty Game as a Ruse For Team Building

Women employees line up to kiss their boss in china

team building exercise, naughty exercise, boss with women employees, new defination team spirit, china boss team spirit, viral Video, Chinese boss, employees team spirit, pass pens mouths and lips, trending video, shocking video, naughty video, team spirit video

Chinese boss however invented a naughty kissing game that he sold to his female employees as a team building exercise. This video went viral on a popular Chinese sharing website.

ITEMVIDEOS:మహిళా ఉద్యోగులతో టీమ్ స్పిరిట్ కు కొత్త బాష్యం చెప్పిన బాస్

Posted: 08/10/2016 07:53 AM IST
Women employees line up to kiss their boss in china

టీమ్ స్పిరిట్.. ఇది ఎక్కడైనా ఒక జట్టుకు కావాల్సిందే. విజయాన్ని అస్వాదించేందుకు ఇదే ముఖ్యభూమిక పోషిస్తుంది. ఈ పదాన్ని భారతీయులు ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లో గెలిచినప్పుడు వినబడుతుంది. ఒక రాజకీయ పార్టీ గెలవడానికి పార్టీ క్యాడర్ లో ఐక్యత ఎంత అవసరమో.. ఒక బృందం గెలవడానికి ఇదీ అంతే. ఈ టీమ్ స్పిరిట్ ప్రస్తుత కాలంలో కార్పోరేట్ కార్యాలయాలలో అధికంగా వినబడుతుంది. ప్రాజెక్టులు నిర్ణీత సమయంలో సక్సెస్ ఫుల్ గా ముగించడానికి కూడా కావాల్సింది టీమ్ స్పిరిట్.

అయితే టీమ్ స్పిరిట్ అర్థాన్ని మార్చేసి.. అధర చుంబనాలే నంటూ కొత్త బాష్యాన్ని చెప్పాడు ఓ కంపెనీ బాస్. చైనాలోని ఓ కంపెనీ బాస్ తన మహిళా ఉద్యోగినుల మధ్య టీమ్ స్పిరిట్‌ను పెంచేందుకు ఓ ఆకతాయి పనికి ఒడి గట్టాడు. నోటిలో పెన్నును ముక్కుకు ఆనిచ్చి పట్టుకొని పెదవుల ద్వారానే ఆ పెన్నును స్వీకరించాల్సిందిగా మహిళా ఉద్యోగులను కోరారు. అలా వారు తీసుకున్న పెన్నును మళ్లీ తన పెదవుల ద్వారా వెనక్కి తీసుకున్నారు. పెన్నును కింద జారవేయకుండానే ఈ తతంగాన్ని కొనసాగాలంటూ ఉద్యోగినులను పురమాయించాడు కూడా. వారిలో ఓ మహిళ ఉద్దేశపూర్వకంగానో, పొరపాటునో పెన్నును నేలకు జార విడిచింది. అప్పుడు బాస్ పెదాలు, మహిళా ఉద్యోగి పెదాలకు తగిలినట్లు తెలుస్తోంది.

ఇదో సరదా ఆటని, ఉద్యోగుల్లో ఈ ఆట టీమ్ స్పిరిట్‌ను పెంచుతుందని బాస్ వారిని ప్రోత్సహించారు. ఎవరో ఈ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి దాన్ని చైనా వీడియో షేరింగ్ సైట్ అయిన ‘మియోపి’లో పోస్ట్ చేయగా, అది సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఆ వీడియో ‘యూట్యూబ్’లో దర్శనమిస్తూ మరింత సంచలనం రేపుతోంది. 40 సెకండ్ల నిడివి గల ఈ వీడియో క్లిప్ మరీ మురిగ్గా ఉందని ఎక్కువ మంది కామెంట్ చేశారు. సాధారణ కంపెనీ అయితే ఈ గేమ్ మాత్రం ఆడదంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘దీన్ని బాస్ భార్య, మహిళా ఉద్యోగినుల భర్తలు చూశారా?’ అంటూ ఇంకొకరు, ‘ఇదే తరహాలో మనం ముద్దుల గేమ్ ఆడొద్దు’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇంతకు ఆ కంపెనీ ఏమిటో, దాని బాస్ ఎవరో తెలియలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles