Kalikho Pul's death: Arunachal Pradesh declares three day state mourning

Violence in itanagar after kalikho s death cm s house attacked

arunachal pradesh, kalikho pul, Kalikho Pul death, Kalikho Pul suicide, violence in itanagar, violence in arunachal pradesh, Deputy CM Chowna Mein, Industries Minister Tapang Taloh, Nabam Tuki, arunachal pradesh, kalikho pul, death, suicide, pema khandu, violence

Angry mobs attacked the house of Arunachal Pradesh CM Pema Khandu and took to the streets of Itanagar torching vehicles, hours after former CM Kalikho Pul was found hanging at his residence.

ఏపీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నివాసాలపై దాడులు

Posted: 08/10/2016 06:21 AM IST
Violence in itanagar after kalikho s death cm s house attacked

మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ తిరుగుబాటు నాయకుడు కలిఖో పుల్ (48) అనుమానాస్పద మృతి అంశం అరుణాచల్ ప్రదేశ్ అట్టుడుకిపోయింది. ఆందోళనకారులు నిరసనలు హింసాత్మకంగా మారియి. కలీఖో అనుమానాస్పద మృతి నేపథ్యంలో సాగిన అందోళనలు ఏకంగా ఈటానగర్ లోని ముఖ్యమంత్రి నివాసానికి తాకాయి. ముఖ్యమంత్రితో పాటుగా ఉప ముఖ్యమంత్రి, పారిశ్రామిక శాఖా మంత్రి అధికార నివాసాలకు వద్ద కూడా పెల్లుబిక్కాయి.

ప్రస్తుత కొత్త ముఖ్యమంత్రి పెమా ఖండూ నివాసంపై కొంతమంది దాడులకు దిగారు. వీధుల్లోకి వచ్చి నిరసన నినాదాలు చేస్తూ పెమా ఖండూ నివాసంపై రాళ్లు విసిరారు. అనంతరం డిప్యూటీ సీఎం చౌనా మెయిన్ వద్దకు వెళ్లి అక్కడి వాహనాలను ధ్వంసం చేశారు. కొన్నింటికి నిప్పు పెట్టారు. దాంతోపాటు అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద ఉన్న వస్తువులకు నిప్పంటించారు. అలాగే, సమీపంలోని మంత్రుల నివాసాలపై కూడా దాడి చేశారు.

కలిఖో పుల్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ఆయన బలవన్మరణానికి పాల్పడివుండొచ్చని భావిస్తున్నారు. అయితే, ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, కుంగుబాటు కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని హోంశాఖ అధికారులు తెలిపారు. గత నెలలో ఆయన పదవి కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్ కు ఆయన 145 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకు సీఎంగా ఉన్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల సాయంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి దక్కించుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arunachal pradesh  kalikho pul  death  suicide  pema khandu  violence  

Other Articles