Telangana CM KCR hails PM for corruption-free governance

Modi ji we want your love hails telangana cm kcr

pm narendra modi, telangana visit, komati banda, mission bhagheeradha, cm kcr, gajwel meeting, venkaiah naidu, piyush goel, suresh prabhu, anath kumar, governer narsimhan, harish rao, swamy goud

CM K Chandrasekhar Rao praised PM Modi for providing "corruption-free" governance in the last two years of the NDA rule and termed him as "most popular" leader in the country.

ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తిన ముఖ్యమంత్రి

Posted: 08/07/2016 04:00 PM IST
Modi ji we want your love hails telangana cm kcr

దివి నుంచి భుమి గంగానదిని తీసుకువచ్చిన భగీరథ పేరుతో తలపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం.. ఆడపడచులు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లే ఇబ్బందులకు చెక్ పెట్టి ఇంటి ముంగిట్లోకి సురక్షిత నీటిని తీసుకువచ్చే మహోన్నత కార్యక్రమమని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణకు ఈ రోజు శుభదినమని పేర్కొన్నారు. ప్రధాని మోదీని, కేంద్ర మంత్రులను కేసీఆర్ ప్రశంసల్లో ముంచెత్తారు. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు.

హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేసీఆర్.. తన పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక స్వాగతం చెబుతున్నానని అన్నారు. సభలో కేసీఆర్ హిందీలోనే ఎక్కువసేపు మాట్లాడారు. కోమటిబండలో మిషన్ భగీరథ సహా పవర్ ప్లాంట్, మనోహరాబాద్-కోత్తపల్లి రైలు మార్గం సహా పలు అభివృద్ధి పథకాలను మోదీ ప్రారంభించిన అనంతరం ఆయనతో కలసి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్తో పాటు గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ, అనంతకుమార్, సురేష్ ప్రభు, పీయూష్ గోయెల్, రాష్ట్ర మంత్రులు సభలో పాల్గొన్నారు.

సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. చాలా అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం చేయూతనిస్తోందని, రాష్ట్రాల తరపున ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో అవినీతిరహిత పాలన సాగుతోందని, ఈ ఘనత ప్రధానిదేనని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు అభివృద్ధిచెందుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్త రాష్ట్రంపై ప్రధాని అభిమానం చూపాలని, అవసరమైనపుడు కేంద్రం సాయం కోరుతామని చెప్పారు. ఐటీఐఆర్, ఎయిమ్స్కు ప్రధాని ఆశీస్సులు కావాలని, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టు కేటాయించాలని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రావాలని అడిగిన వెంటనే మోదీ అంగీకరించారని, వచ్చినందుకు మోదీకి ధన్యవాదాలు చెబుతున్నాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm narendra modi  telangana visit  komati banda  mission bhagheeradha  cm kcr  gajwel meeting  

Other Articles